నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : ఏంటి టిల్లూ.. అందరూ బుద్ధిగా గణితం పరీక్ష రాస్తుంటే.. నువ్వు మాటిమాటికి నిలబడి డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తున్నావు?

Updated : 28 Sep 2022 06:18 IST

అలా అర్థమైందా?

టీచర్‌ : ఏంటి టిల్లూ.. అందరూ బుద్ధిగా గణితం పరీక్ష రాస్తుంటే.. నువ్వు మాటిమాటికి నిలబడి డ్యాన్స్‌ స్టెప్పులు వేస్తున్నావు?
టిల్లు : మీరే చెప్పారు కదా టీచర్‌..

టీచర్‌ : ఏమని?
టిల్లు : ప్రతి స్టెప్పునకూ మార్కులు ఉంటాయని..

టీచర్‌ : ఆ..!!

అదే మ్యాజిక్కు..

కిట్టు : బిట్టూ.. మనం ఏం చూస్తున్నామో మా టీవీకి ఇట్టే తెలిసిపోతుంది తెలుసా?
బిట్టు : అదెలా సాధ్యం?

కిట్టు : ఏమో బిట్టూ.. నిన్న సాయంత్రం నేను కార్టూన్‌ ప్రోగ్రాం చూస్తుంటే, మధ్యలో ఒకావిడ వచ్చి ‘మీరు బొమ్మల ఛానల్‌ చూస్తున్నారు’ అని చెప్పేసి మాయమైపోయింది..
బిట్టు : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని