నవ్వుల్‌.. నవ్వుల్‌...!

టీచర్‌ : పింకీ.. ఒకవేళ కరెంట్‌ కనిపెట్టకపోతే ఏం జరిగేది?

Published : 29 Sep 2022 00:26 IST

అలాగా..

టీచర్‌ : పింకీ.. ఒకవేళ కరెంట్‌ కనిపెట్టకపోతే ఏం జరిగేది?

పింకి : ఏముంది టీచర్‌.. ఛార్జింగ్‌ లైట్ల వెలుగులోనే టీవీ చూడాల్సి వచ్చేది..

టీచర్‌ : ఆ..!!


భలే కవరింగ్‌..

అమ్మ : ఒరేయ్‌ ఒరేయ్‌.. తీరిగ్గా కూర్చొని తమ్ముడికి చెడ్డ మాటలన్నీ నేర్పుతున్నావేంట్రా..?

రాకీ : నేర్పటం లేదమ్మా.. ఈ మాటలన్నీ మనం అస్సలు అనకూడదనీ, పొరపాటుగా అన్నా కూడా నాన్న కోప్పడతాడని చెబుతున్నా..

అమ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు