నవ్వుల్‌...! నవ్వుల్‌...!

గిరి : హరీ.. ఫోర్డ్‌ అంటే ఏంటో తెలుసా?

Published : 01 Oct 2022 00:11 IST

భలే చెప్పాడు..

గిరి : హరీ.. ఫోర్డ్‌ అంటే ఏంటో తెలుసా?
హరి : అదో కార్లు తయారు చేసే కంపెనీ..

గిరి : అలాగా.. మరి, ఆక్స్‌ఫోర్డ్‌ అంటే?
హరి : ఆమాత్రం తెలియదా గిరీ.. ‘ఆక్స్‌’ అంటే ఎద్దు కదా.. ‘ఆక్స్‌ఫోర్డ్‌’ అంటే ఎద్దులు లాగే కారన్నమాట..

గిరి : ఆ..!!

పెద్ద లక్ష్యమే..

టీచర్‌ : బంటీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు?
బంటి : పెద్ద రాజకీయ నాయకుడిని అవుతా టీచర్‌..

టీచర్‌ : అదే ఎందుకు?
బంటి : అప్పుడు పిల్లలకు ఉచితంగా ఐస్‌క్రీమ్‌, పరీక్షలు మాఫీ, స్నానం రద్దులాంటి పథకాలు ప్రవేశపెడతా టీచర్‌..

టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు