నవ్వుల్‌.. నవ్వుల్‌..!

కార్తి: దేవుడా.. ఓ మంచి దేవుడా.. నాకో మంచి సైకిల్‌ ప్రసాదించు స్వామీ.. వినిపిస్తోందా?

Published : 02 Oct 2022 01:18 IST

వినిపిస్తుందా..!

కార్తి: దేవుడా.. ఓ మంచి దేవుడా.. నాకో మంచి సైకిల్‌ ప్రసాదించు స్వామీ.. వినిపిస్తోందా?

అమ్మ: అంత గొంతుచించుకొని అరవడమెందుకు కార్తీ.. చిన్నగా చెబితే దేవుడికి వినిపించదా ఏంటి?

కార్తి: దేవుడికి వినిపిస్తుంది కానీ, నాన్నకు వినిపించాలి కదమ్మా..!

అమ్మ: ఆ..!!


పెద్దలంటే గౌరవం మరి..

రమ : ఉమా.. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్లు నిల్చుంటే నేనస్సలు చూడలేను తెలుసా..

ఉమ : అవునా.. ఆ సమయంలో నువ్వు నిల్చొని, నీ సీటు వాళ్లకి ఇచ్చేస్తావా?

రమ : కాదు.. వాళ్లకి సీటు దొరికే వరకూ నా కళ్లు మూసుకుంటా..


కనిపెట్టాడోచ్‌..

బామ్మ : ఏంటి చింటూ.. ఆకాశంవైపే చూస్తూ కూర్చున్నావు?

చింటు : మరేం లేదు బామ్మా.. ఆకాశంలోకి చూస్తుంటే నాకో కొత్త విషయం తెలిసింది..

బామ్మ : అవునా.. ఏంటది?

చింటు :చీకటంటే చంద్రుడికి కూడా భయమే.. అందుకే, బోలెడు చుక్కలను వెంటేేసుకొస్తాడు..

బామ్మ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని