Published : 05 Oct 2022 00:14 IST

నవ్వుల్‌... నవ్వుల్‌...!

భలే భలే..

టీచర్‌ : పింకీ.. ఈరోజు హోంవర్క్‌ ఎందుకు చేయలేదు?
పింకి : ఏ రోజు పని ఆరోజే చేయాలని మీరే అన్నారు కదా టీచర్‌.. అందుకే, నిన్నటి పనిని ఈరోజు చేయలేదు..

టీచర్‌ : అలాగా.. అయితే, నిన్న ఇచ్చిన హోంవర్క్‌ను నిన్ననే పూర్తి చేయాలి కదా.!
పింకి : చేద్దామనే బ్యాగు తీశా టీచర్‌.. కానీ, వెంటనే.. ‘నిదానమే ప్రధానం’ అని మీరు చెప్పిన మాట గుర్తొచ్చి ఆగిపోయా..

టీచర్‌ : ఆ..!!

నమ్మరేంటి..!

అమ్మ : ఏంటి హిమజా.. అలిగినట్లు ఉన్నావు?
హిమజ : అవునమ్మా.. నేనేం చెప్పినా నాన్న నమ్మడం లేదు..

అమ్మ : ఇప్పుడేమైంది..?
హిమజ : నా ప్రోగ్రెస్‌ కార్డులో 90 మార్కులను చూసి.. తొమ్మిది పక్కన సున్నాను నువ్వే చేర్చావు కదూ అని అంటున్నారమ్మా..

అమ్మ : నిజం చెప్పొచ్చు కదా మరి..
హిమజ : నేను నిజమే చెబుతున్నానమ్మా.. సున్నా నేను చేర్చలేదు.. నేను చేర్చింది తొమ్మిది..

అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని