నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టీచర్‌ మీరేమో మాకు హోం వర్క్స్‌ ఇస్తారు. మరి మీరెందుకు హోం వర్క్స్‌ చేయరు. మాకేమో ఎగ్జామ్స్‌ పెడతారు.

Published : 07 Oct 2022 00:49 IST

సమన్యాయం ఏది?

బంటి: టీచర్‌ మీరేమో మాకు హోం వర్క్స్‌ ఇస్తారు. మరి మీరెందుకు హోం వర్క్స్‌ చేయరు. మాకేమో ఎగ్జామ్స్‌ పెడతారు. మీరెందుకు ఎగ్జామ్స్‌ రాయరు. చెప్పండి టీచర్‌. ఇదెక్కడి సమన్యాయం?

టీచర్‌: ఆఁ!!

దటీజ్‌ కిట్టూ!

నాన్న: ఏంటి కిట్టూ.. నీకు మ్యాథ్స్‌లో మరీ ఇన్ని తక్కువ మార్కులు వచ్చాయి. నేను చదువుకునే రోజుల్లో నాకు ఎన్ని మార్కులు వచ్చేవో తెలుసా?

కిట్టు: నాన్నా.. సరిగా చూడండి. అది మీ ప్రోగ్రెస్‌ రిపోర్టే.

నాన్న: ఆఁ!!

ప్లీజ్‌ నాన్నా!

బిట్టు: నాన్నా.. నా ఆధార్‌ కార్డు అర్జెంట్‌గా అప్‌డేట్‌ చేయించాలి.

నాన్న: ఇప్పుడు అంత తొందరేముందిరా నీకింకా అయిదేళ్లు కూడా నిండలేదు కదా!

బిట్టు: అది కాదు నాన్నా..
ఆ ఫొటోలో నేను అందంగా కనిపించడం లేదు..  

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని