నవ్వుల్‌...! నవ్వుల్‌...!

టీచర్‌: ఏంటి బంటీ ఈ మధ్య అన్నీ అబద్ధాలే చెబుతున్నావు?

Published : 10 Oct 2022 00:27 IST

మీరే చెప్పారని!

టీచర్‌: ఏంటి బంటీ ఈ మధ్య అన్నీ అబద్ధాలే చెబుతున్నావు?

బంటి: ఆ మధ్య మీరే చెప్పారు కదా టీచర్‌.. నిజం నిప్పులాంటిదని. అందుకే.. ఎందుకైనా మంచిదని అబద్ధాలే చెబుతున్నా టీచర్‌.

టీచర్‌: ఆఁ!!


ఇలా ఆలోచిస్తే...

టీచర్‌: నో పెయిన్‌.. నో గెయిన్‌ అంటే ఏంటో తెలుసా...

చంటి: తెలుసు టీచర్‌. కానీ.. అన్ని బాధలు అనుభవించడం ఎందుకు. నో గెయిన్‌.. నో పెయిన్‌ అని కూడా అనుకుని హాయిగా ఉండొచ్చు కదా!

టీచర్‌: ఆఁ!!


దటీజ్‌ టింకు!

నాన్న: టింకూ.. అరిసె తింటావా?

టింకు: లేదు నాన్నా.. అరవకుండానే తింటా.

నాన్న:ఆఁ!!


ఎంత తెలివో....

నాన్న: అదేంటి బిట్టూ... గులాబి చెట్టు, జామచెట్టు కలిపి నాటుతున్నావు?

బిట్టు: గులాబి చెట్టు, జామచెట్టు కలిపి నాటితే పెద్దయ్యాక గులాబ్‌జామ్‌లు కాస్తాయని.

బిట్టు: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని