నవ్వుల్‌...! నవ్వుల్‌...!

మావయ్య : ఏంటి రాజూ.. దేనిగురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నావు?

Published : 13 Oct 2022 00:23 IST

ఎవరి ఆశ వారిది..

మావయ్య : ఏంటి రాజూ.. దేనిగురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఉన్నావు?

రాజు : అవును మావయ్యా..

మావయ్య : విషయం ఏంటో?

రాజు : మాకూ ఓటు హక్కు ఉంటే బాగుండేది కదా అనీ..

మావయ్య : మీకెందుకు రా..?

రాజు : అప్పుడు మా ఓట్ల కోసం రాజకీయ నాయకులందరూ పోటాపోటీగా చాక్లెట్లు, ఐస్‌క్రీములు పంచిపెడతారు కదా మావయ్యా.. 

మావయ్య : ఆ..!!


ఎంత భయమో..

టీచర్‌ : పిల్లలూ.. దసరా సెలవుల్లో కొత్తగా ఏదైనా నేర్చుకున్నారా?

రాణి : నేనైతే ఒక కొత్త విషయం కనిపెట్టా టీచర్‌..

టీచర్‌ :వెరీగుడ్‌.. ఏంటది?

రాణి : చీకటంటే సూర్యుడికి కూడా భయమే టీచర్‌.. సాయంత్రం కాగానే మబ్బుల చాటుకి వెళ్లిపోతుంటాడు..

టీచర్‌ : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని