నవ్వుల్‌...! నవ్వుల్‌...!

నాన్న : ఏంటి చింటూ.. చపాతీలను అలా చివర్లు వదిలేసి తింటున్నావు?

Published : 14 Oct 2022 00:07 IST

భలే.. భలే..

నాన్న : ఏంటి చింటూ.. చపాతీలను అలా చివర్లు వదిలేసి తింటున్నావు?
చింటు : సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీ రాకుండా నాన్నా..
నాన్న : ఆ..!!

నీకు వచ్చా అసలు?

కిట్టు : బిట్టూ.. ఇన్ని రోజులు మా చెల్లికి హిందీ మాత్రమే రాదని అనుకున్నా.. కానీ, లెక్కలు అస్సలే రావని నిన్ననే తెలిసింది..  
బిట్టు : అవునా.. ఎలా?
కిట్టు : టీవీలో ఎవరో ఏబీసీడీలు ఎన్నని అడిగితే.. దానికి మా చెల్లి ఇరవై ఆరు అని సమాధానం చెప్పిందిరా.. అవి నాలుగే కదా!

అవునా..?

టీచర్‌ : రాధా.. నువ్వు సెలవుల్లో కొత్తగా ఏం నేర్చుకున్నావు?
రాధ : ఓ విషయం కనిపెట్టా టీచర్‌..
టీచర్‌ : ఏంటది?
రాధ : పగటిపూట వెలుగునిచ్చి.. సూర్యుడు తన శక్తిని వృథా చేస్తున్నాడు టీచర్‌..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని