నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌ : పిల్లలూ.. ఇప్పుడు నేను చెప్పే డిక్టేషన్‌ సరిగ్గా రాసిన వాళ్లకు చాక్లెట్లు ఇస్తాను..

Published : 16 Oct 2022 00:12 IST

అబ్బా.. తెలివి..

టీచర్‌ : పిల్లలూ.. ఇప్పుడు నేను చెప్పే డిక్టేషన్‌ సరిగ్గా రాసిన వాళ్లకు చాక్లెట్లు ఇస్తాను..

పింకి : సరిగ్గా వినిపించడం లేదు.. కాస్త బోర్డు మీద రాయండి టీచర్‌..

టీచర్‌ : ఆ..!


నిన్ను మర్చిపోతే ఎలా..

అంకుల్‌ : ఏంటి టింకూ.. ఏదో ఆలోచిస్తున్నావు?

టింకు : మరేం లేదు అంకుల్‌.. నాకు ఒకే అన్నయ్య ఉన్నాడు కానీ, మా చెల్లికి మాత్రం ఇద్దరన్నయ్యలున్నారు. అదెలా సాధ్యమైందో అర్థం కావట్లేదు..

అంకుల్‌ : ఆ..!!


నిజమే మరి..

కిట్టు : బిట్టూ.. చలికాలంలో మనకూ, దొంగలకూ తేడా తెలియదు తెలుసా..

బిట్టు : ఎందుకలా?

కిట్టు : అందరూ ముసుగులు వేసుకొనే ఉంటారు కదా..

బిట్టు : ఆ..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని