నవ్వుల్‌.. నవ్వుల్‌..!

తెలిసింది అదే మరి...టీచర్‌ : విశాల్‌.. భూమి గురించి నీకేం తెలుసో చెప్పు..?

Updated : 08 Mar 2023 05:18 IST

తెలిసింది అదే మరి..  
టీచర్‌ : విశాల్‌.. భూమి గురించి నీకేం తెలుసో చెప్పు..?
విశాల్‌ : ఆ ఏముంది టీచర్‌.. వానకు తడుస్తుంది.. ఎండకు ఎండుతుంది..  

టీచర్‌ : ఆ..!!
ఎంత తెలివో.!
గిరి : ఒరేయ్‌ హరీ.. నేను చాలా తెలివైనవాడిని తెలుసా..?
హరి : అవునా.. ఎలా చెప్పగలవు?

గిరి : చిన్నప్పుడు మా అమ్మ నాకు నడక మాత్రమే నేర్పించింది.. పరుగెత్తడం, గెంతులు వేయడం, అల్లరి చేయడం.. ఇలా అన్నీ నేనే సొంతంగా నేర్చుకున్నా..
హరి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు