నవ్వుల్‌.. నవ్వుల్‌.!

బంటీ.. ఈరోజు నుంచి మీకు పరీక్షలు కదా?

Published : 14 Mar 2023 01:23 IST

నిజమే మరి..

నాన్న : బంటీ.. ఈరోజు నుంచి మీకు పరీక్షలు కదా?
బంటి : అవును నాన్నా..
నాన్న : మరేంటి.. అంత నిదానంగా బ్యాగ్‌ సర్దుకుంటున్నావు?
బంటి : ఇంత చిన్న వయసులో ఇంకెన్ని పరీక్షలు ఎదుర్కోవాలా.. అని..
నాన్న : ఆ..!!

అన్నీ అబద్ధాలే..

రేష్మి : అమ్మా.. నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే..
అమ్మ : ఇప్పుడేమైంది?
రేష్మి : నాయనమ్మకు షుగర్‌ ఉందంటావు కదా..
అమ్మ : అవును..
రేష్మి : మరెప్పుడూ తియ్యగా మాట్లాడదేంటి..?
అమ్మ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని