నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నేను కూడా..చంటి: టీచర్‌.. టీచర్‌.. ఇందాక మీరు క్లాస్‌ చెబుతున్నప్పుడు బుజ్జి నిద్రపోయాడు..

Published : 16 Mar 2023 01:44 IST

నేను కూడా..  
చంటి: టీచర్‌.. టీచర్‌.. ఇందాక మీరు క్లాస్‌ చెబుతున్నప్పుడు బుజ్జి నిద్రపోయాడు..
టీచర్‌: అవునా.. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు?

చంటి: అప్పుడు నేనూ నిద్రపోయా టీచర్‌..
టీచర్‌: ఆఁ..!భలే.. భలే..  

చింటు: మనం గులాబీ, జామ మొక్కలను కలిపి నాటుదాం నాన్నా..
నాన్న: ఎందుకు రా..?

చింటు: అది పెద్దయ్యాక నాకు ఇష్టమైన గులాబ్‌ జామూన్‌లు ఇస్తుంది కదా నాన్నా..నిజమే కదా..!
టీచర్‌: బంటీ.. నీ పుట్టినరోజు ఎప్పుడు?

బంటి: అక్టోబరు 17న టీచర్‌..
టీచర్‌: అవునా.. ఏ సంవత్సరం?

బంటి: ప్రతి సంవత్సరం టీచర్‌..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని