నవ్వుల్‌.. నవ్వుల్‌.!

అలా అర్థమైందా? బంటి: చింటూ.. నువ్వు నన్ను మోసం చేశావు? చింటు : ఏమైంది బంటీ..

Updated : 12 Apr 2023 04:52 IST

అలా అర్థమైందా?


బంటి: చింటూ.. నువ్వు నన్ను మోసం చేశావు?
చింటు : ఏమైంది బంటీ..

బంటి : మొన్న నా పుట్టినరోజుకు ‘మేడిన్‌ జపాన్‌’ రేడియో అని చెప్పి బహుమతి ఇచ్చావు కదా?  
చింటు : ఆ.. అవును..

బంటి : అదంతా అబద్ధం.. దాన్ని ఆన్‌ చేస్తే.. ‘దిస్‌ ఈజ్‌ ఆలిండియా’ రేడియో అని చెబుతోందిరా..


చూసింది చెప్పాడు..


టీచర్‌: పిల్లలూ.. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. తెలిసిన వాళ్లు జవాబు చెప్పండి.
విద్యార్థులు : సరే టీచర్‌..

టీచర్‌ : ‘తాజ్‌మహల్‌’ ఎక్కడుంది?  
అవినాష్‌: ‘టీ పొడి’ డబ్బా మీద టీచర్‌..

టీచర్‌: ఆఁ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని