నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: కిట్టూ.. ఇప్పుడు నేనో ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెబితే నీకో చాక్లెట్‌ ఇస్తాను..

Published : 22 Apr 2023 00:12 IST

అసలిస్తే కదా?

టీచర్‌: కిట్టూ.. ఇప్పుడు నేనో ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం చెబితే నీకో చాక్లెట్‌ ఇస్తాను..
కిట్టు : అలాగే టీచర్‌..
టీచర్‌ : నీ దగ్గర అయిదు రూపాయలు ఉన్నాయి. మళ్లీ మీ అమ్మని ఇంకో అయిదు రూపాయలు అడిగావు. అప్పుడు నీ దగ్గర మొత్తం ఎన్ని డబ్బులు ఉంటాయి?  
కిట్టు : అయిదు రూపాయలే టీచర్‌..
టీచర్‌ : అదేంటి?
కిట్టు : మా అమ్మ సంగతి మీకు తెలియదు టీచర్‌.. అసలు ఒక్క రూపాయి కూడా ఇవ్వదు..
టీచర్‌ : ఆ..!!

తు.చ. తప్పకుండా..

టీచర్‌: చింటూ.. ఎందుకు ప్రతిరోజూ స్కూల్‌కి ఆలస్యంగా వస్తున్నావు?  
చింటు: వచ్చే దారిలో రోడ్డు పక్కన ఉండే ఓ బోర్డు వల్ల టీచర్‌..
టీచర్‌: బోర్డా..?
చింటు : అవును టీచర్‌.. దాని మీద ‘నెమ్మదిగా వెళ్లండి.. ఇది స్కూల్‌ జోన్‌’ అని రాసి ఉంది..  
టీచర్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని