నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Updated : 01 Jun 2023 05:36 IST

జీవితమే ఓ పరీక్ష..

మావయ్య : ఏంటి రామూ.. సెలవుల్లో హుషారుగా ఉండాల్సింది పోయి, దిగాలుగా కనిపిస్తున్నావు?

రాము : స్కూళ్లు తెరిచే సమయం దగ్గర పడింది కదా మావయ్యా.. మళ్లీ హోంవర్కులనీ, పరీక్షలనీ ఉంటాయి.. ఇంత చిన్న జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలో అని..

పెద్ద ప్లానే..!

అంకుల్‌ : లహరీ.. నువ్వు పెద్దయ్యాక ఏమవుదామనుకుంటున్నావు?

లహరి : ఆర్థిక మంత్రి అవుతానంకుల్‌..

అంకుల్‌ : వెరీగుడ్‌.. ఎందుకు?

లహరి : చాక్లెట్లకూ, ఐస్‌క్రీమ్‌లకూ ఏటా ప్రత్యేక నిధులు కేటాయిస్తా అంకుల్‌..

అంకుల్‌ : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని