నవ్వుల్‌... నవ్వుల్‌..!

పిల్లలూ.. నీళ్లు మరిగించేటప్పుడు శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా?

Published : 02 Jun 2023 00:37 IST

అదా సంగతి..!

టీచర్‌ : పిల్లలూ.. నీళ్లు మరిగించేటప్పుడు శబ్దం ఎందుకు వస్తుందో తెలుసా?

పింకి : నాకు తెలుసు టీచర్‌..

టీచర్‌ : వెరీగుడ్‌.. ఎందుకో చెప్పు?

పింకి : వేడి ఎక్కువయ్యే కొద్దీ నీళ్లలో ఉండే క్రిమికీటకాలు బాధతో కేకలు పెడతాయి టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

కోపం రాదా మరి..

హరి : ఏంటి గిరీ.. మీ అక్క ఫోన్‌లో ఎవరినో బాగా కోప్పడుతోంది?

గిరి : మరేం లేదు హరీ.. స్నేహితురాలితో కలిసి తను బయటకు వెళ్లాలనుకుంది..

హరి : ఆ.. అయితే..?

గిరి : మా అక్క అయిదు నిమిషాల్లో బయలుదేరుతున్నానని చెప్పినా, ప్రతి పది నిమిషాలకూ ఫోన్‌ చేసి విసిగిస్తుంటేనూ..!

హరి : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని