నవ్వుల్‌.. నవ్వుల్‌.!

Published : 04 Jun 2023 00:16 IST

పరీక్షించాడు.. అంతే కదా..!

మావయ్య : కిట్టూ.. వీధి చివరనున్న దుకాణంలోని గాజు గ్లాసులను పగలగొట్టావంట. ఎందుకు?

కిట్టు : మరేం లేదు మావయ్యా.. బంతి కొనుక్కుందామని వెళ్లా.. మంచిదేనా అని అడిగితే.. గోడకు కొట్టి మరీ చూపించాడా దుకాణంలోని వ్యక్తి..

మావయ్య : ఆ అయితే..

కిట్టు : అక్కడే గాజు గ్లాసులు మెరుస్తూ కనిపించాయి. నాణ్యత పరీక్షిద్దామని బంతిలాగే వాటినీ గోడకు విసిరి కొట్టానంతే..

మావయ్య : ఆ..!!

సింపుల్‌ మరి..

నాన్న : అనూ.. జీవితం అంటే ఏంటో తెలుసా?

అను : తెలుసు నాన్నా.. పిల్లలకేమో ఇంటి నుంచి బడికీ, బడి నుంచి ఇంటికీ వెళ్లడం.. పెద్దలకేమో ఇంటి నుంచి ఆఫీస్‌కు, ఆఫీస్‌ నుంచి ఇంటికీ వెళ్లడం..

నాన్న : ఆ..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు