విమానాలు వెనక్కు వెళ్తాయా?

సాధారణ విమానాలు వెనక్కు ప్రయాణించలేవు. అంతెందుకు? అవి విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ ....

Updated : 11 Mar 2020 00:50 IST

ప్రశ్న: విమానాలు వెనక్కు ప్రయాణించగలవా?

- ఆర్‌.గీత, హైదరాబాద్‌

సాధారణ విమానాలు వెనక్కు ప్రయాణించలేవు. అంతెందుకు? అవి విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ (పైకి ఎగరడం) కోసం ఉన్న చోటు నుంచి వెనక్కు పోలేకపోవడంతో వాటిని ట్రాక్టరు లాంటి భారీ యంత్రం వెనక్కు లాగుతుంది. విమానాలు ప్రయాణించే యంత్రాంగంలో రెక్కలకు బిగించి ఉన్న ఇంజన్లు.. గాలిని పీల్చుకొని దహన వాయువుల్ని అధిక పీడన వేగంతో వెనక్కి నెట్టడం ద్వారా ముందుకు వెళ్తాయి. అయితే యుద్ధ విమానాల్లో ఇంజన్లను అటూఇటూ తిప్పే వ్యవస్థ ఉండటం వల్ల అవి ఎటైనా వెళ్లగలవు. హెలికాఫ్టర్లు కూడా ఏ వైపైనా వెళ్లగలవు.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని