నేనేం చేస్తానంటే.. !

హాయ్‌ ఫ్రెండ్స్‌.. త్వరలో మనకు కొత్త సంవత్సరం రాబోతోంది. 2022లో నేను నా అల్లరి తగ్గించుకుందాం అనుకుంటున్నా. అమ్మ చెప్పిన మాట బుద్ధిగా వినాలి అని కూడా అనుకుంటున్నా.

Published : 28 Dec 2021 00:34 IST

అమ్మ మాట వింటా!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. త్వరలో మనకు కొత్త సంవత్సరం రాబోతోంది. 2022లో నేను నా అల్లరి తగ్గించుకుందాం అనుకుంటున్నా. అమ్మ చెప్పిన మాట బుద్ధిగా వినాలి అని కూడా అనుకుంటున్నా. అలాగే మా టామీని ఇకపై అసలు కొట్టను. దాని తోక కూడా పట్టుకుని లాగను. స్కూలు నుంచి వచ్చిన తర్వాత నా బ్యాగు, షూస్‌, యూనిఫాం అన్నీ ఓ పద్ధతి ప్రకారం సర్దుకుంటా. వాడిన తర్వాత టవల్‌ కూడా ఉండలా చుట్టి పడేయకుండా చక్కగా ఆరేస్తా. అప్పుడప్పుడు అమ్మకు చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తాను. ఇంకా చాక్లెట్లు పూర్తిగా మానేయలేను కానీ... తినడం మాత్రం తగ్గించుకుంటా.

- మోహిత్‌, మూడో తరగతి, హైదరాబాద్‌

నేస్తాలూ! మీరూ ఇలాగే 2022లో మీలో కొన్ని మార్పులు చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే అవేంటో చెబుతూ.. మీ పేరు, ఊరు, తరగతి మొదలైన వివరాలతో మాకు మెయిల్‌ చేయండి. అన్నట్లు మీ ఫొటో పంపడం మాత్రం మరిచిపోకండేం.

email hai@eenadu.in


క్విజ్‌.. క్విజ్‌..!

1. మనిషికి ఉపయోగపడే ఆహారాన్ని తయారు చేసే ఏకైక కీటకం ఏది?
2. ప్రపంచంలోనే అతిపెద్ద గుహ ఏ దేశంలో ఉంది?
3. ఏ దేశంలో మెట్రో స్టేషన్‌లో గుంజీలు తీస్తే టికెట్‌ ఫ్రీగా ఇస్తారు?
4. ఏ జంతువు వేలిముద్రలు మనుషుల వేలిముద్రలను పోలి ఉంటాయి?
5. ‘ది గ్రాండ్‌ ఓల్డ్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఎవరిని అంటారు?
6. ఆంధ్రప్రదేశ్‌లో కాఫీ తోటలు ఏ జిల్లాలో ఉన్నాయి?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
అనుమానం, అవమానం, బహుమానం, సన్మానం, సత్కారం, సత్కార్యం, ఆహారం, ఆహార్యం, కొలమానం, సహనం, అసహనం, దహనం, ఆపద, సంపద, సంహారం, సిరిసంపదలు, పురపాలన, సింహాసనం, వదనం, వందనం, నయనం, పయనం



 


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షర హారతి!: 1.తిరుపతి  2.తిలకం 3.తిరోగమనం 4.తిప్పలు 5.తిరగలి

పదంలో పదం: 1.త్రయం- తాపత్రయం 2.లత- కొలత 3.రాయి- ఆకురాయి 4.కొండ- కొండచిలువ 5.కాలం- కొంతకాలం 6.హారం- పరిహారం

క్విజ్‌.. క్విజ్‌..!: 1.తేనెటీగ 2.వియత్నాం 3.రష్యా 4.కోలా 5.దాదాభాయ్‌ నౌరోజీ 6.విశాఖపట్నం

అది ఏది?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని