చిత్రాల్లో గప్‌చుప్‌!

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే గాల్లో ఎగిరే ఓ వస్తువు పేరు వస్తుంది.

Updated : 20 Jan 2022 00:47 IST

ఈ చిత్రాల పేర్లను తెలుగులో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే గాల్లో ఎగిరే ఓ వస్తువు పేరు వస్తుంది.


క్విజ్‌.. క్విజ్‌...!

1. వెనక్కు ఎగరగలిగే ఒకే ఒక పక్షి ఏది?
2. ఇండియన్‌ మిలటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
3. థాయిలాండ్‌ జాతీయ పుస్తకం ఏది?
4. బంకింగ్‌హామ్‌ కాలువ ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉంది?
5. తమిళనాడు రాష్ట్ర రాజధాని ఏది?


ఒక చిన్నమాట

Success is not final; failure is not fatal: It is the courage to continue that counts

విజయం అంతిమమైనది కాదు. వైఫల్యం ప్రాణాంతకం కాదు. కొనసాగించాలనే ధైర్యం ముఖ్యం.


తమాషా ప్రశ్నలు!

1. కనిపించని వనం ఏది?
2. ఆదాయం ఇచ్చే బడి?
3. బైరాగి దగ్గర ఉన్న లోహం పేరేంటి?
4. సమయం చూపించని వాచీ ఏది?
5. విలువైన నిజం ఏది?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
నవధాన్యాలు, ఊరపిచ్చుక, కోయిల, నెమలి, కాకి, కొంగ, ఎలుగుబంటి, ఎలుక, గుంటనక్క, సొరచేప, సొరకాయ, మొక్కజొన్న, అన్నం, భోజనం, ఆహారం


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.నేను గీసిన బొమ్మ


జవాబులు:

చిత్రాల్లో గప్‌చుప్‌!: 1.ప్రపంచపటం 2.రోకలి 3.గాడిద 4.పడవ (దాగున్న పేరు: గాలిపటం)

క్విజ్‌.. క్విజ్‌.. :  1.హమ్మింగ్‌ బర్డ్‌ 2.డెహ్రాడూన్‌ 3.రామకియన్‌ 4.ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు  5.చెన్నై

తేడాలు కనుక్కోండి: 1.పక్షి రెక్క 2.నక్క నోరు 3.కాలు 4.తోక 5.చెట్టుకొమ్మ 6.పొద 

 తమాషా ప్రశ్నలు: 1.పవనం 2.రాబడి 3.రాగి 4.తివాచీ 5.ఖనిజం
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని