క్విజ్‌.. క్విజ్‌..!

ఉల్లిపాయలను అధికంగా పండించే దేశం ఏది?

Published : 04 Feb 2022 00:53 IST

1. ఆస్ట్రిచ్‌ పక్షి తర్వాత.. అతిపెద్ద గుడ్లు పెట్టే పక్షి పేరేంటి?

2. ఉల్లిపాయలను అధికంగా పండించే దేశం ఏది?

3. మొసళ్లలో మొత్తం ఎన్ని జాతులున్నాయి?  

4. వానపాముకు ఎన్ని జతల కళ్లుంటాయి?

5. ఒక సంవత్సరంలో ఎన్ని వారాలుంటాయి?

6. ఏ జీవి తన జీవితకాలమంతా నీరు తాగకుండా ఉండగలదు?


తప్పేంటో చెప్పండి!

నేస్తాలూ! ఇక్కడున్న ప్రతి పదంలోనూ ఓ తప్పుంది. అదేంటో కనిపెట్టి సరైన సమాధానం రాయండి.
1. అస్వశాల
2. తెలివిథేటలు
3. కుటుబం
4. అమాయకుఢు
5. విధ్యార్థి
6. సంయమణం
7. ఆళంబన
8. ఆపశోపాలు


ఒక చిన్నమాట

Peace begins with a smile
శాంతి చిరునవ్వుతో మొదలవుతుంది.


దారేది?

మిన్నీ, తన హెయిర్‌బ్యాండ్‌ ఎక్కడో పెట్టి మరిచిపోయింది. మీరు కాస్త దారి చూపి సాయం చేయరూ!


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


జత ఏది?

ఇక్కడ రెండు వృత్తాలున్నాయి. పై వృత్తంలోని పదాలకు కింది వృత్తంలోని పదాలు సరిపోతాయి. కానీ అవి క్రమపద్ధతిలో లేవు. మీరు చేయాల్సిందల్లా.. పై వృత్తంలోని పదాలను, కింది వృత్తంలోని పదాలతో జతపరచడమే.


నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌... క్విజ్‌...: 1.ఈము పక్షి 2.చైనా 3.14 జాతులు 4.అసలుండవు 5.52 వారాలు 6.కంగారూ ఎలుక

తప్పేంటో చెప్పండి!: 1.అశ్వశాల 2.తెలివితేటలు 3.కుటుంబం 4.అమాయకుడు 5.విద్యార్థి 6.సంయమనం 7.ఆలంబన 8.ఆపసోపాలు

కవలలేవి?: 2, 3

జత ఏది?: 1- ఇ, 2- సి, 3- జి, 4- ఎ, 5- బి, 6- డి, 7- హెచ్‌, 8- ఎఫ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని