తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 18 Feb 2022 00:58 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న పదాల్లో ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంది. అది ఏదో చెప్పగలరా?
కరోనా, వ్యాక్సిన్‌, రోగ నిరోధకత, మాస్కు, డాక్టరేట్‌, శానిటైజర్‌


నేనెవర్ని?

1. మడతలో ఉన్నాం. ఉడతలోనూ ఉన్నాము. చిడతలోనూ దాగి ఉన్నాం కానీ పిడకలో మాత్రం లేము. ఇంతకీ మేము ఎవరం?

2. జంటగా ఉంటాం. మీతోనే ఉంటాం. దూరంగా ఉన్నవి చూపిస్తాం.. దగ్గరలో ఉన్నవి చదివిస్తాం. మేం ఎవరం?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే అర్థవంత పదాలు ప్రత్యక్షమవుతాయి. ఒకసారి ప్రయత్నించండి.

1. మరహాతంభా

2. వువవరరార

3. పుతిణరాఇసాహాలు

4. దుగలకుఅంరు

5. మరహంపస

6. రాతాణంగ


అక్షర వలయం

ఇచ్చిన ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను పూరించండి. అన్నీ ‘క’తో మొదలయ్యే పదాలే వస్తాయి.

1. తామర మరోలా..

2. విభిన్న అంశాల సమాహారం

3. సముద్రం 

4. యుద్ధం

5. రక్షణగా నిలిచేది 

6. ఓ వ్యాధి 

7. దయ, జాలి.. లాంటిది 

8. బంగారం


క్విజ్‌.. క్విజ్‌..!

1. ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెనను ఎక్కడ నిర్మిస్తున్నారు?

2. సగటు మనిషి శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?

3. ఓడలు, నౌకలు నిలిచే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు?

4. చందమామ ఏరోజు నిండుగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది?

5. ఈ చిత్రంలో కనిపిస్తున్న బొమ్మల పేరేమిటి?

6. ప్రయోగాత్మక దశలో ఉన్న సాంకేతికతను ఏమంటారు?


నేను గీసిన బొమ్మ!


జవాబులు

తేడాలు కనుక్కోండి : 1.జింక కాళ్లు 2.ఎలుక చెవి 3.కాకి తోక 4.చెట్టు 5.పొద 6.రాయి

క్విజ్‌.. క్విజ్‌ : 1.జమ్మూ కశ్మీర్‌ 2.206 3.హార్బర్‌ 4.పౌర్ణమి 5.జూజూ 6.బీటా వెర్షన్‌

నేనెవర్ని : 1.‘డత’ అక్షరాలు 2.కళ్లద్దాలు

అక్షర వలయం : 1.కమలం 2.కదంబం 3.కడలి 4.కదనం 5.కవచం 6.కలరా 7.కరుణ 8.కనకం

ఆ ఒక్కటి ఏది : డాక్టరేట్‌

గజిబిజి బిజిగజి : 1.మహాభారతం 2.వరవరరావు 3. పురాణ ఇతిహాసాలు 4. అంగలకుదురు 5. పరమహంస 6.తారాగణం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని