అక్షరాలేవి?

చిత్రాలను చూసి ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలేవో రాయండి.

Updated : 06 Mar 2022 06:03 IST

చిత్రాలను చూసి ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలేవో రాయండి.


చెప్పగలరా?

1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి నాలుగు అక్షరాలు కలిపితే అడవికి రాజునవుతా. 2, 3, 4 అక్షరాల కలిస్తే జబ్బు అనే అర్థం వస్తుంది. ఇంతకీ నేను ఎవరిని?

2. నేను అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. నా విలువ పదిలోపే అయినా చెట్టునే నాలో దాచుకున్నా. నేనెవర్నో తెలుసా?


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజి బిజిగజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1. రదాచపం
2. రకురచెసం
3. రంగామాలిదు
4. ర్షంకాలఅవ
5. రలంఅకాయంప్రా
6. రాపాఅనచకల


పొడుపు కథలు

1. ఓ బుల్లి ఇల్లు. అందులో ఓ పిల్ల. ఆ ఇంటికి కిటికీలు లేవు, తలుపులూ లేవు. గోడలు పగలుగొట్టుకుని మాత్రమే బయటకు రావాలి. పగలగొట్టుకుని బయటకు వచ్చాక ఇక ఆ ఇల్లు పనికిరాదు. ఇంతకీ ఏంటది?

2. పాకుతుంది కానీ పాము కాదు. చెట్లెక్కగలదు కానీ కోతి కాదు. నీడనిస్తుంది కానీ చెట్టు కాదు. ఇంతకీ ఏంటది?

3.వేలెడంత ఉండదు కానీ, మనం బయటకు వెళ్లాలన్నా, ఇంట్లోకి రావాలన్నా అది మాత్రం ఉండాల్సిందే. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


క్విజ్‌.. క్విజ్‌..!

1. ఏ జీవికి తొమ్మిది మెదళ్లు ఉంటాయి?

2. వెనక్కి కూడా ఎగరగలిగే సామర్థ్యం ఏ పక్షికి ఉంటుంది?

3. ‘హార్స్‌ షూ క్రాబ్స్‌’ రక్తం ఏ రంగులో ఉంటుంది?

4. ఎగరగలిగే ఏకైక క్షీరదం పేరేంటి? 

5. ప్రపంచంలోకెల్లా అతిచిన్న దేశం ఏది?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న సంఖ్యల్లో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టండి.
2646   8862   2164
4826   6284   4466


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



నేను గీసిన బొమ్మ!


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.ఆక్టోపస్‌ 2.హమ్మింగ్‌ బర్డ్‌ 3.నీలిరంగులో 4.గబ్బిలం 5.వాటికన్‌ సిటీ

ఏది భిన్నం : 2

గజిబిజి బిజిగజి!: 1.పంచదార 2.చెరకు రసం 3.గాలిదుమారం 4.అకాలవర్షం 5.అలంకారప్రాయం 6.అరాచకపాలన

పొడుపు కథలు: 1.గుడ్డు 2.తీగజాతి మొక్క 3.తాళం చెవి

ఆ ఒక్కటి ఏది : 2164 (మిగతా వాటిలో అన్నీ సరి అంకెలే ఉన్నాయి)

అక్షరాలేవి?: 1.ఎలుగుబంటి 2.వానరము 3.వానపాము 4.కంచరగాడిద 5.నెమలి 6.తిమింగలం

చెప్పగలరా : 1.MILLION 2.THREE


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని