ఎందుకో తెలుసా?
ఫ్రెండ్స్... మనకు యాపిల్స్ అంటే చాలా ఇష్టం కదూ! అయితే మీకో విషయం తెలుసా.. యాపిల్స్ నీళ్లలో తేలుతాయి. అవును ఫ్రెండ్స్.. నిజంగానే యాపిల్స్ నీళ్లలో తేలుతాయి. కావాలంటే మీరూ చిన్న పాత్రలో నీటిని నింపి అందులో యాపిల్‌ను వేసి చూడండి. అది కచ్చితంగా తేలుతుంది. మరి కారణం ఏంటో తెలుసా...? యాపిల్‌లో దాదాపు 25 శాతం గాలి ఉంటుంది. అలాగే యాపిల్ సాంద్రత, నీటి సాంద్రత కన్నా తక్కువ. అందుకే యాపిల్ ఎంచక్కా నీటిలో తేలుతుంది.
క్విజ్.. క్విజ్..!
1. అతి తక్కువ సమయం నిద్రపోయే జీవి ఏది?
2. కుక్కల కోసమంటూ ప్రత్యేకంగా ఏర్పాటైన మొట్టమొదటి టీవీ ఛానల్ పేరేంటి?
3. ఆఫ్రికాలోని ఏ దేశాన్ని కవలల దేశం అని పిలుస్తారు?
4. ప్రపంచవ్యాప్తంగా ఏ రెండు దేశాల్లో కోకాకోలా దొరకదు?
5. ఏ జీవి పాలు గులాబీ రంగులో ఉంటాయి?
6. నక్షత్ర చేపకు ఎన్ని మెదళ్లు ఉంటాయి?
చెప్పుకోండి చూద్దాం!
1. ముక్కు మీదికెక్కు, ముందర చెవులు నొక్కు, టక్కునిక్కుల సోకు, జారిందంటే పుటుక్కు. ఇంతకీ అదేంటో చెప్పుకోండి చూద్దాం?
2. అమ్మ తమ్ముడు కాదు, కానీ మీ అందరికీ మేనమామే. ఇంతకీ ఏంటో తెలుసా?
3. అయిదుగురిలో చిన్నోడు. పెళ్లికి మాత్రం పెద్దోడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
అక్షరాల చెట్టు
ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.
కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.
ఎటైనా ఒకటే!
ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.
నేను గీసిన బొమ్మ
జవాబులు
క్విజ్.. క్విజ్...: 1.జిరాఫీ 2.డాగ్‌టీవీ 3.బెనిన్ 4.ఉత్తర కొరియా, క్యూబా 5.హిప్పోపొటమస్ 6.అసలు మెదడే ఉండదు
అక్షరాల చెట్టు: INVESTIGATION
పొడుపు కథలు: 1.కళ్లద్దాలు 2.చందమామ 3.చిటికెన వేలు
కవలలేవి?: 2, 4
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా
-
India News
నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్ భాగవత్
-
Sports News
IND vs AUS: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ.. గెలిచేది ఆ జట్టే: మహేల జయవర్దనే
-
General News
Amaravati: రాజధాని అంశంపై ఈనెల 23న సుప్రీంలో విచారణ
-
India News
Delhi Mayor: దిల్లీ మేయర్ ఎన్నిక.. ముచ్చటగా మూడోసారి విఫలం..!
-
Movies News
Balakrishna: నా మాటలను వక్రీకరించారు.. నర్సుల వివాదంలో క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ