నేనెవరు?

నేనో నాలుగు అక్షరాల తెలుగుపదాన్ని. మొదటి రెండక్షరాలకు ‘వాయువు’ అని అర్థం. చివరి రెండక్షరాలకు ‘యంత్రం’ అనే అర్థం వస్తుంది. ఇప్పటికైనా నేనెవరో చెప్పుకోండి చూద్దాం?

Updated : 23 Mar 2022 12:24 IST

నేనో నాలుగు అక్షరాల తెలుగుపదాన్ని. మొదటి రెండక్షరాలకు ‘వాయువు’ అని అర్థం. చివరి రెండక్షరాలకు ‘యంత్రం’ అనే అర్థం వస్తుంది. ఇప్పటికైనా నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


ఎటైనా ఒకటే!

ఇక్కడి ఆధారాల సాయంతో గడులను నింపండి. అడ్డంగా, నిలువుగా ఎటు చదివినా అవే పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.


చెప్పుకోండి చూద్దాం?

1. వెలుగులు పంచుతుంది. తనను తానే మింగుతుంది. చివరికి చీకట్లో కలిసిపోతుంది. ఏంటో తెలుసా?

2. అనగనగా ముగ్గురు అన్నదమ్ములు. వాళ్లంతా రాత్రనక, పగలనక నడుస్తూనే ఉంటారు. ఇంతకీ ఏంటది? 

3. సముద్రంలో పుట్టి, సముద్రంలో పెరిగి, ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. దాని పేరేంటో చెప్పగలరా?


క్విజ్‌.. క్విజ్‌..!

1. మానవ శరీరంలో రక్త సరఫరా జరగని ఏకైక భాగం ఏది?

2. మన శరీరంలో ఏ అవయవంలో అధిక కొవ్వు ఉంటుంది?

3. నత్త రక్తం ఏ రంగులో ఉంటుంది?

4. మన కడుపులో ఆహారం జీర్ణం కావడానికి విడుదలయ్యే ఆమ్లం ఏది?

5. ఏ జీవి తన తల తెగినా.. దాదాపు వారం వరకు బతకగలుగుతుంది?


అటు ఇటు.. ఇటు అటు!

రెండు ఖాళీ గళ్లలో ఒకే ఆంగ్ల అక్షరం రాసి, పదాన్ని పూరించండి.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.కార్నియా 2.మెదడు 3.నీలం 4.హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం 5.బొద్దింక
నేనెవరు?: గాలిమర
చెప్పుకోండి చూద్దాం?: 1.కొవ్వొత్తి 2.గడియారం 3.శంఖం  
ఏది భిన్నం?: 2
అటు ఇటు.. ఇటు అటు!: 1.Local 2.Pump 3.talent 4.tablet 5.memorandum 6.ticket 7.Diamond 8.Health


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని