క్విజ్‌.. క్విజ్‌..!

ఏ దేశ శాస్త్రవేత్తలు మానవుల రక్తంలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు ఇటీవల గుర్తించారు?

Updated : 31 Mar 2022 05:43 IST

1. ఏ దేశ శాస్త్రవేత్తలు మానవుల రక్తంలో సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు ఇటీవల గుర్తించారు?
2. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం పేరేంటి?
3. తాజ్‌ మహల్‌ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది?
4. ‘ల్యాండ్‌ ఆఫ్‌ మార్బుల్‌’ అని ఏ దేశాన్ని పిలుస్తారు?
5. కన్యాకుమారి ఏ రాష్ట్రంలో ఉంది?  
6.  సహస్రం అంటే ఎంత?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించి చూడండి.

1. జుజగరా
2. మజురాహా 
3. డునవుమా
4. రాతామమనుగం
5. రుచిమంనీ
6. మేమాఘల


నేనెవర్ని?

నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘పండు’లో ఉంటాను. ‘పుండు’లో ఉండను. ‘చలువ’లో ఉంటాను. ‘కలువ’లో ఉండను. ‘దానవుడు’లో ఉంటాను. ‘మానవుడు’లో ఉండను. ‘రవ్వ’లో ఉంటాను. ‘అవ్వ’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?


చెప్పుకోండి చూద్దాం!

1. ఎర్రని, పచ్చని చిన్నోళ్లు. వేలెడంతైనా ఉండరు. కానీ, కొరికితే మాత్రం, ఆ కోపానికి మనం వేగలేం. నోరు తెరవకుండా ఉండలేం. అంతటి ఘటికులు ఆ చిన్నోళ్లు. ఇంతకీ ఏంటవి చెప్పుకోండి చూద్దాం?
2. బుల్లి పడవలో పొందికైన పచ్చని ముత్యాలు. కాల్చితే కాలక్షేపానికి ప్రతీకలు. ఏంటో తెలుసా?
3. పచ్చగానూ ఉంటా. తెల్లగానూ ఉంటా. పండితే మాత్రం ఎర్రగా ఉంటా. ఎలా ఉన్నా, రుచిలో మాత్రం పెద్దగా తేడా ఉండదు. ఇష్టం లేకపోయినా కొంటారు. ఆరోగ్యం కోసం కష్టపడి తింటారు. ఇంతకీ నేనెవరో చెప్పుకోండి చూద్దాం.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి



ఆ ఒక్కటి ఏది?

ఇక్కడున్న అంశాల్లో ఒక్కటి మాత్రం భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం.
1. హిందీ, ఒరియా, మరాఠీ, ఫ్రెంచ్‌, కన్నడ, తెలుగు
2. క్లాస్‌వర్క్‌, హోంవర్క్‌, ప్రాజెక్టు వర్క్‌, వుడ్‌ వర్క్‌, సెమినార్‌ వర్క్‌  


కనిపెట్టండోచ్‌!

ఇక్కడ కొన్ని జంట పదాలున్నాయి. కానీ అవి విడివిడిగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటిని కలపడమే.


నేను గీసిన బొమ్మ


జవాబులు

క్విజ్‌.. క్విజ్‌: 1.నెదర్లాండ్స్‌ 2.సూర్యుడు 3.22 సంవత్సరాలు 4.ఇటలీ 5.తమిళనాడు 6.వెయ్యి

చెప్పుకోండి చూద్దాం: 1.మిరపకాయలు 2.బఠాణీలు 3.కాకరకాయ

గజిబిజి బిజిగజి!: 1.గజరాజు 2.మహారాజు 3.మానవుడు 4.మమతానురాగం 5.మంచినీరు 6.మేఘమాల

నేనెవర్ని?: పంచదార

కనిపెట్టండోచ్‌: ఆకలిదప్పులు, కారాలు- మిరియాలు, అన్నదమ్ములు, అందం-చందం, అదురు-బెదురు, ఆకులు-అలములు, ఆట-పాట, ఆటుపోట్లు, గొడ్డు-గోదా, చిందరవందర, చెట్టు- చేమ, చదువు- సంధ్య, చాటుమాటు, చేదోడు- వాదోడు, తళుకు- బెళుకు, పాడిపంటలు

ఏది భిన్నం: 2

ఆ ఒక్కటి ఏది : 1.ఫ్రెంచ్‌ (మిగతావన్నీ భారతీయ భాషలు) 2. వుడ్‌ వర్క్‌(మిగతావి చదువుకు సంబంధించినవి)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని