తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం

Published : 05 Apr 2022 01:02 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం



గజిబిజి బిజిగజి
ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి.
ఓసారి ప్రయత్నించండి.
1. రంపపకారో
2. గురుపంపదెం
3. తిహుబమ
4. తినుభూఅ
5. నంలమాకొ
6. లంకావివేస
7. ళీగారనంము
8. సంహారద


వస్తువులే వస్తువులు!
ఈ కింది వాక్యాల్లో వస్తువుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి
అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.
1.  కొంచెం చాలు.. నాకు ఎక్కువ వద్దు పిన్నీ!
2. నిన్నే పిలిచా... కులదీప్‌ నీకు వినిపించలేదా?
3. అప్పడాలు, వడియాలు అంటే నాకు చాలా ఇష్టం అక్కా!
4. ఆ జింక.. లంక భూముల్లోంచి వచ్చినట్లుంది.
5. ఏమ్మా తులసీ... సాగరిక వచ్చిందా.. లేదా?


సాధించగలరా?


ఇక్కడ అగ్గిపుల్లలతో ఒక సమీకరణం ఉంది. కానీ, అది తప్పు.
రోమన్‌ అంకెల్లో ఏదైనా ఒక పుల్లను జరిపి సమీకరణాన్ని ఒప్పు చేయగలరా?


చెప్పుకోండి చూద్దాం!
1. అది ఎంతో మధురం. తిన్నామంటే మాత్రం ఓ పట్టాన వదలం. అది ఎన్నో కీటకాల శ్రమ ఫలితం. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. బయటి నుంచి బండిలో వచ్చి, పందిట్లో సందడి చేసి, చివరకు చెత్తకుప్పలోకి వెళ్లిపోతుంది. ఏంటో తెలుసా?
3. మొక్కకు, చెట్టుకు, తీగకూ పూయని పువ్వులు. జడలో, తలలో పెట్టుకోలేని విరులు. అందరికీ ఆనందాన్ని విరజిమ్మే వెలుగులు. ప్రతి ఒక్కరి మోములో సంతోషాన్ని తెచ్చే జిలుగులు. ఇంతకీ ఏంటో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు?
1.  ఎవరూ కొట్టకుండానే తగిలే దెబ్బ ఏమిటి?
2. అందరూ నమస్కరించే కాలు ఏమిటి?
3. ఏ క్రికెట్‌ ఆటగాడు అతిపెద్ద హెల్మెట్‌ ధరిస్తాడు?


నేను గీసిన బొమ్మ


జవాబులు 

గజిబిజి బిజిగజి: 1.పరోపకారం 2.పరుగుపందెం 3.బహుమతి 4.అనుభూతి 5.కొలమానం 6.వేసవికాలం 7.మురళీగానం 8.దరహాసం

చెప్పుకోండి చూద్దాం?: 1.తేనె 2.విస్తరాకు 3.మతాబులు, కాకరపువ్వొత్తులు, చిచ్చుబుడ్లు

తమాషా ప్రశ్నలు: 1.వడదెబ్బ 2.పుస్తకాలు 3.పెద్ద తల ఉన్న క్రికెటర్‌

వస్తువులే వస్తువులు: 1.చెంచా 2.చాకు 3.డాలు 4.కలం 5.సీసా

తేడాలు కనుక్కోండి!: 1.పీత 2.కొవ్వొత్తి 3.కేక్‌ 4.మేఘం 5.గడియారం 6.క్యారెట్‌  

సాధించగలరా : VI+V=XI (మొదటి ‘శ్రీ’లోని ఒక పుల్లను జరిపి ‘జు’ చేస్తే సరి.)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని