నేనెవర్ని?
నీరులో ఉన్నాను కానీ ఆవిరి కాను. నీలోనూ ఉన్నాను కానీ నాలో మాత్రం నేను లేను. ఇంతకీ నేనెవర్ని?
మచ్చటగా మూడు!
ఈ చిత్రంలో మూడు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ మూడు పదాలేంటో కనిపెట్టండి.
చెప్పుకోండి చూద్దాం
1. చెప్పేవి చూడలేవు. చూసేవి చెప్పలేవు. ఏమిటవి?
2. ఆకువేసి అన్నంపెడితే ఆకు తీసి భోజనం చేస్తాం. ఏమిటది?
3. గూటిలో గువ్వ.. ఎంత గుంజినా రాదు! ఏంటో తెలుసా?
4. అరచేతి పట్నాన, అరవై రంధ్రాలు. అదేంటో చెప్పుకోండి చూద్దాం?
చిత్రాల్లో ఏముందో!
ఈ బొమ్మల పేర్లను గడుల్లో రాయండి. రంగు గడుల్లోని అక్షరాలను సరిచేసి రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.
రాయగలరా!
ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి.
జత ఏది?
ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటికి సరిపడేవి పక్కనే ఉన్నాయి. కానీ అవి వరసలో లేవు. మీరు చేయాల్సిందల్లా వాటిని జతపరచడమే.
తమాషా ప్రశ్నలు
1. ప్రతి ఒక్కరిలోనూ ఉండే పాము?
2. ఆయుధం కాని విల్లు?
3. నరకానికి తీసుకెళ్లే పాలు?
4. వాడిపోని రోజాలు?
సాధించగలరా?
ఇక్కడ ఆంగ్ల అక్షరాలతోపాటు కొన్ని ఖాళీ గడులూ ఉన్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపితే అర్థవంతమైన పదాలు వస్తాయి. ‘A’ను రెండుసార్లు, ‘B’ నుంచి ‘Z’ వరకూ ఒకసారి మాత్రమే వాడాలనేది నిబంధన.
ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి
నేను గీసిన బొమ్మ
జవాబులు
నేనెవర్ని?: ‘నీ’ అనే అక్షరం
జత ఏది?: 1-ఇ, 2-జి, 3-హెచ్, 4-ఎఫ్, 5-బి, 6-డి, 7-సి 8- ఎ ఏది భిన్నం?: 3
రాయగలరా!: 1.నడక 2.నలుగు 3.నయనం 4.నలత 5.నలుపు 6.నలక/నలుసు
తమాషా ప్రశ్నలు: 1.వెన్నుపాము 2.హరివిల్లు 3.పాపాలు 4.శిరోజాలు
చిత్రాల్లో ఏముందో!: చెరకు రసం (1.రవ్వలడ్డు 2.తోరణం 3.చెదపురుగులు 4.మీనం 5.మేకు)
ముచ్చటగా మూడు: advocate , boundary , exercise
చెప్పుకోండి చూద్దాం: 1.పెదవులు, కళ్లు 2.కరివేపాకు 3.నాలుక 4.జల్లెడ
సాధించగలరా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
చనిపోయాడనుకొని ఖననం చేశారు.. కానీ స్నేహితుడికి వీడియో కాల్!
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23