చెప్పుకోండి చూద్దాం?

కళ్లు లేకపోయినా ఏడుస్తుంది. కాళ్లు లేకపోయినా నడుస్తుంది. ఏంటో తెలుసా?..

Published : 21 Apr 2022 00:47 IST

1.  కళ్లు లేకపోయినా ఏడుస్తుంది. కాళ్లు లేకపోయినా నడుస్తుంది. ఏంటో తెలుసా?
2. అయిదుగురు అన్నదమ్ముల్లో చిన్నోడు. పెళ్లికి మాత్రం పెద్దోడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. కోస్తే తెగదు. కొడితే పగలదు. ఏంటో చెప్పగలరా?
4. చేతికి దొరకనిది, ముక్కుకు మాత్రం దొరుకుతుంది. అదేంటో చెప్పుకోండి చూద్దాం?


వాక్యాల్లో వస్తువులు!

ఈ కింది వాక్యాల్లో వస్తువుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.
1. మిన్నూ..! నేను అప్పుడే చెప్పాగా.. జున్ను అక్కడే ఉందని!
2. అన్నా..! కొంచెం బుజ్జిగాడిని చూస్తూ ఉంటారా!
3. కనకం.. చంపకమాల పద్యం ఒకటి చెప్పు.
4. నిన్నే..! రామం, చందూ.. ఎక్కడున్నాడో తెలిసిందా?
5. గోపీ... టక్కుటమార విద్యలు నా దగ్గర చూపించకు.  


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మలో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



అక్షరాల ఆట!

ఈ ఆధారాల సాయంతో గడులను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలున్నాయి కదా! వాటిల్లో ఒక్కో పదానికి మరో పర్యాయపదం ఉంది. మరి వాటిని కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ!


జవాబులు

చెప్పుకోండి చూద్దాం?: 1.మేఘం 2.చిటికెన వేలు 3.నీడ 4.వాసన

వాక్యాల్లో వస్తువులు!: 1.గాజు 2.చెంబు 3.కంచం 4.మంచం 5.పీట

తేడాలు కనుక్కోండి: 1.పెంగ్విన్‌ రెక్క 2.స్నోమ్యాన్‌ చెయ్యి 3.బ్రష్‌ 4.చెట్లు 5.ఇగ్లూ ద్వారం 6.స్కార్ఫ్‌

అక్షరాల ఆట: 1.కలం 2.బలం 3.హలం 4.జలం 5.పొలం 6.శూలం 7.చలం 8.ఫలం

రాయగలరా?: 1.వర్షం- వాన 2.కేసరి- సింహం 3.సురులు- దేవతలు 4.నీరు- ఉదకము 5.తార- చుక్క 6.ప్రఖ్యాతి- కీర్తి 7.విరించి- బ్రహ్మ 8.కాంచనం- బంగారం 9.నరుడు- మానవుడు 10.పోరు- రణం 11.శయ్య- పాన్పు 12.విశ్వాసం- నమ్మకం 13.కృప- దయ 14.దివ్వె- దీపం 15.అబ్బురం- వింత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని