సాధించగలరా?

ఇక్కడ పుల్లలతో ఒక ఆకారం ఉంది. వాటిలోంచి ఏవైనా రెండు పుల్లలను తీసేసి, రెండు చతురస్రాలను తయారు చేయగలరా?....

Published : 28 Apr 2022 00:56 IST

ఇక్కడ పుల్లలతో ఒక ఆకారం ఉంది. వాటిలోంచి ఏవైనా రెండు పుల్లలను తీసేసి, రెండు చతురస్రాలను తయారు చేయగలరా?


పలకా పలుకవే!

ఈ పలక మీద గజిబిజిగా ఉన్న అక్షరాల్లో ఒక వాహనం, ఒక ఆట వస్తువు పేరూ దాగి ఉన్నాయి. అవి ఏంటో కనిపెట్టండి చూద్దాం.


చెప్పుకోండి చూద్దాం!

1. మొదట చప్పన, నడుమ మాత్రం పుల్లన, ఆఖరున కమ్మన. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
2. రెక్కలు లేని పిట్ట.. గూటికి మాత్రం సరిగ్గా చేరింది. ఏంటో తెలుసా?
3. తిరిగే దీపము.. గాలి, వానకు ఆరని దీపము.. చమురు లేని దీపము.. పిట్టలు తినే దీపము.. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
4. నాలుగు కాళ్లున్నాయి. జంతువును కాను. శరీరంతా రంధ్రాలున్నాయి. కానీ వలను కాను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి?


గజిబిజి  బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.  

1. యంహాశమ
2. యంతిశఅ
3. ణరోపఆ
4. లంసాకూను  
5. తంసోపేహసా
6. నగావహఅ
7. యనాడుకు
8. షసాఘోరగ


తమాషా ప్రశ్నలు?

1. తాళి కాని తాళి, ఏంటది?
2. అందరూ తక్కువగా మాట్లాడే నెల?
3. చించలేని కార్డు.. కానీ బద్దలు కొట్టగల కార్డు?  
4. కొట్టలేని కర్ర, ఊతంగా పనికిరాని కర్ర, చలి మంటకూ పనికి రాని కర్ర?


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


 

 


నేను గీసిన బొమ్మ


జవాబులు

చెప్పుకోండి చూద్దాం?: 1.పాలు, పెరుగు, నెయ్యి 2.ఉత్తరం 3.మిణుగురు పురుగు 4.మంచం

తమాషా ప్రశ్నలు?: 1.ఎగతాళి 2.ఫిబ్రవరి 3.రికార్డు 4.జీలకర్ర

అది ఏది?: b

గజిబిజి బిజిగజి: 1.మహాశయం 2.అతిశయం 3.ఆరోపణ 4.సానుకూలం 5.సాహసోపేతం 6.అవగాహన 7.నాయకుడు 8.సాగరఘోష

పలకా పలుకవే : LORRY, BALL

సాధించగలరా?


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని