తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 27 May 2022 00:59 IST


కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.




అవునా.. కాదా?
ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి.
వాటిని జాగ్రత్తగా చదివి.. అవునో, కాదో చెప్పండి.
1. తెలుగు రాష్ట్రాలు రెండు.
2. మలేరియా ఈగల వల్ల వ్యాపిస్తుంది.
3. లీపు సంవత్సరం ప్రతి అయిదు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది.
4. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద గుడ్డు ఆస్ట్రిచ్‌ పెడుతుంది.
5. కొండచిలువ విషపూరిత సర్పం.
6. నక్క విశ్వాసపాత్రమైన జంతువు.



నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. ‘పంపించడం’ అనే అర్థాన్నిస్తాను. చివరి మూడక్షరాలు కలిస్తే.. ‘ముగింపు’ అనీ, 4, 2, 3 అక్షరాలు ‘స్థావరం’ అనీ సూచిస్తాయి. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 5, 7 అక్షరాలు పెంపుడు జంతువునూ.. 2, 3, 4, 5 అక్షరాలు తాడునూ సూచిస్తాయి. నేనెవరో చెప్పగలరా? 


 చెప్పుకోండి చూద్దాం?
1. నన్నెవరూ లెక్కచేయరొకసారి, పక్కన చేర్చుకుని పదింతలంటూ సన్మానిస్తారొకసారి. ఏంటది?
2. చూసేది చెప్పలేదు. చెప్పేది చూడలేదు. ఏంటో తెలుసా?
3. కడవంత ఒళ్లు. ఒంటి నిండా ముళ్లు. కడుపంతా మధురమైన గుళ్లు.. ఏంటో చెప్పుకోండి?



నేను గీసిన బొమ్మ


 


జవాబులు
చెప్పుకోండి చూద్దాం?: 1.సున్నా 2.కన్ను, నోరు 3.పనసకాయ
తేడాలు కనుక్కోండి: 1.సీ హార్స్‌ 2.షార్క్‌ 3.ఓడ 4.పేపర్‌ 5.రుమాలు 6.శాంతాక్లాజ్‌ మీసం
ఒకటే.. ఒకటే.. : 1.తల 2.నది 3.కోడి 4.కంది 5.లక్ష
పదమాలిక: 1.earthquake 2.woodpecker 3.donkey 4.smoke 5.mistake 6.skeleton 7.basket 8.snake 
ఏ రెండు: 2, 6 (డాల్ఫిన్‌, తిమింగలానికి మొప్పలుండవు. ఈ రెండింటికీ ఊపిరితిత్తులే ఉంటాయి)
అవునా.. కాదా?: 1.అవును 2.కాదు (దోమల వల్ల వ్యాపిస్తుంది) 3.కాదు (నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది) 4.అవును 5.కాదు 6.కాదు (కుక్క విశ్వాసమైన జంతువు)
నేనెవర్ని:  1. SEND 
2. PROPERTY
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని