అది ఏది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?
అంత్యాక్షరి!
నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతో తర్వాతది ప్రారంభం అవుతుంది. ఓసారి ప్రయత్నించండి.
చెప్పగలరా?
1. ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 4, 5, 7 అక్షరాలు కలిస్తే ‘బొమ్మ’ అనీ.. 3, 5, 4 అక్షరాలు ‘మంచం’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 4, 5 అక్షరాలు కలిస్తే ‘ఎలుక’ అనీ.. 1, 4, 5 అక్షరాలు ‘పిల్లి’ అనే అర్థాన్నిస్తాయి. చివరి మూడక్షరాలు మాత్రం ‘తిన్నాను’ అని సూచిస్తాయి. నేనెవర్నో చెప్పగలరా?
వాక్యాల్లో పువ్వుల పేర్లు
ఈ వాక్యాల్లో కొన్ని పువ్వుల పేర్లు దాగున్నాయి. కనుక్కోగలరా?
1. గణేష్ ఆగు.. లాబీయింగ్‌తో అక్కడ పనులేవీ కావు.
2. మన పక్కింటి పరంధామం.. దారం రీలు తీసుకెళ్లి ఇంకా తిరిగి ఇవ్వలేదు.
3. మొన్నటి మ్యాచ్‌లో నేను కొట్టిన బంతి.. మా ఇంటి డాబాపైన పడింది తెలుసా?
4. ఇందాకే ఆ నరసన్న.. జాజి కొమ్మ తీసుకొచ్చి ఇచ్చాడమ్మా..
5. సరితా.. మర పట్టించుకు రావడానికి ఇంతసేపు పట్టిందా నీకు?
ఆ ఒక్కటి ఏది?
ఇక్కడున్న బొమ్మల్లో ఒక్కటి మాత్రం మిగతావాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి చూద్దాం.
నేను గీసిన చిత్రం
జవాబులు
అది ఏది : 2
అంత్యాక్షరి : 1.ఎలుక 2.కడవ 3.వరస 4.సపోట 5.టపాసులు
చెప్పగలరా : 1. VICTORY 2. CREATE
వాక్యాల్లో పువ్వుల పేర్లు : 1.గులాబీ 2.మందారం 3.బంతి 4.సన్నజాజి 5.తామర
ఆ ఒక్కటి ఏది : 2 - బార్బీ బొమ్మ (మిగతావన్నీ జంతువులను పోలిన బొమ్మలు)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!