చెప్పగలరా?

అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మధ్యలోని మూడు అక్షరాలు రాసే సాధనాన్ని సూచిస్తే.. 1, 3, 4, 5 అక్షరాలు ‘పంపించడం’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

Published : 05 Jul 2022 00:33 IST

1. అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మధ్యలోని మూడు అక్షరాలు రాసే సాధనాన్ని సూచిస్తే.. 1, 3, 4, 5 అక్షరాలు ‘పంపించడం’ అనే అర్థాన్నిస్తాయి. ఇంతకీ నేనెవరో తెలిసిందా?

2. నేను ఎనిమిది అక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి నాలుగక్షరాలు ‘జారడం’ అనీ.. 2, 3, 4, 8 అక్షరాలు ‘పెదవులు’ అనే అర్థాన్నిస్తాయి. నేను ఎవరినో చెప్పగలరా?

3. అయిదక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. చివరి మూడక్షరాలు కలిస్తే ‘చెవి’ అనీ.. 5, 3, 4, 2 అక్షరాలు కలిస్తే ‘వాస్తవం’ అనే అర్థాన్నిస్తా. నేనెవర్నో చెప్పండి?


వాక్యాల్లో వంట పదార్థాల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో వంటకు వినియోగించే కొన్ని పదార్థాల పేర్లు దాగున్నాయి. అవేంటో కనిపెట్టండి చూద్దాం.

1. మా అమ్మకు బంధువులంటే మమకారం ఎక్కువ. ఇంటికి ఎవరొచ్చినా, సకల మర్యాదలూ చేస్తుంది.

2. దీప సుపుత్రుడు గోపి.. ఆ ఇంటి పిల్లల్లో అతడే మంచివాడు.

3. మా ఊరి పేరు ఉప్పుగూడెం.  ఇక్కడి నుంచి కేవలం పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అంతే!

4. కేశవా.. మునుపు ఇచ్చిన పుస్తకాలు ఇచ్చి, కొత్తవి తీసుకెళ్లు.. సరేనా!

5. నీ స్పందన పేలవం.. గంటకోసారైనా ఇక నుంచి సరిగా పరిశీలించు!


పొడుపుకథలు

1. మంచం కిందే ఉంటాయి.. ఊరనగానే జంటగా వచ్చేస్తాయి. ఏంటవి?

2. యంత్రం కాని యంత్రం.. ప్రతి రోజూ వచ్చే యంత్రం. ఏంటబ్బా?

3. కాళ్లు లేని మంచం.. ఎందరు కూర్చున్నా విరగని మంచం.. ఏంటది?



గజిబిజి.. బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలుగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.

1. అరధాసాణం

2. రిదిమంపంచం

3. శావివంలతం

4. డుగుడుచె

5. శంసివిలానీనీకా

6. వాదేయంల

7. కిలుతతకి

8. ద్రముయాసనం


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని జీవులు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనుక్కోండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన చిత్రం


జవాబులు

అది ఏది?: 2

వాక్యాల్లో వంట పదార్థాల పేర్లు : 1.కారం 2.పసుపు 3.ఉప్పు 4.వాము 5.లవంగం

గజిబిజి.. బిజిగజి : 1.అసాధారణం 2.పందిరిమంచం 3. విశాలవంతం 4.చెడుగుడు 5.సినీవినీలాకాశం 6.దేవాలయం 7.కితకితలు 8.సముద్రయానం

ఆ ఒక్కటి ఏది : 4 (నక్క - మిగతా వాటిని ఇళ్లలో పెంచుకుంటారు)

చెప్పగలరా : 1.SPENT 2.SLIPPERS 3.CLEAR

పొడుపు కథలు : 1.చెప్పులు 2.సాయంత్రం 3.అరుగు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని