అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 05 Feb 2023 16:11 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే తప్పులు

ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. కానీ, అవి తప్పు. వాటిని సరిజేసి  రాయగలరా?
1. దుర్మార్ఘుడు
2. ఆకాసం
3. పధమాలిక
4. అసామాన్వుడు
5. పగతి
6. కోలాహాలం
7. పదనిసలూ
8. విహంగవీక్షనం


వాక్యాల్లో ప్రాంతాల పేర్లు

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో అక్కడక్కడా కొన్ని ప్రాంతాల పేర్లు దాగున్నాయి. అవేంటో కనుక్కోండి.
1.  తాను నా స్నేహితురాలు విజయ. వాడవాడలా తిరుగుతూ ప్లాస్టిక్‌ వాడొద్దని అవగాహన కల్పిస్తుంటుంది.  
2. అలా నీరసంగా.. రెడ్డి హోటల్‌లో పడిగాపులు కాసే బదులు, నేరుగా ఇంటికే రావొచ్చు కదా!  
3. పెద్ద పిడుగు, రాళ్ల వర్షం కారణంగా మా పక్క ఊరిలో విషాదం అలుముకుంది.
4. మా మిత్రురాలు శుభమంగళ.. గిరి ప్రదక్షిణ చేసి వచ్చేవరకూ.. మేమంతా గుడి బయటే షాపింగ్‌ చేశాం.  
5. మనిషన్నాక నిలకడ, పరువు చాలా అవసరం.
6. నువ్వు నా బంగారు కొండ. గట్టు మీదే జాగ్రత్తగా కూర్చొని చూస్తూ ఉండు. సరేనా!


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు : QUALIFICATION

వాక్యాల్లో ప్రాంతాల పేర్లు: 1.విజయవాడ 2.సంగారెడ్డి 3.పిడుగురాళ్ల 4.మంగళగిరి 5.కడప 6.కొండగట్టు

తప్పులే తప్పులు : 1.దుర్మార్గుడు 2.ఆకాశం 3.పదమాలిక 4.అసామాన్యుడు 5.ప్రగతి 6.కోలాహలం 7.పదనిసలు 8.విహంగవీక్షణం

కవలలేవి? : 2, 4 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని