తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 08 Aug 2022 00:19 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేనెవర్ని?

1. అయిదు అక్షరాల పదాన్ని నేను. ‘వంద’లో ఉన్నాను కానీ ‘మంద’లో లేను. ‘దేశం’లో ఉన్నాను కానీ ‘పాశం’లో లేను. ‘మాట’లో ఉన్నాను కానీ ‘కోట’లో లేను. ‘తట్ట’లో ఉన్నాను కానీ ‘బుట్ట’లో లేను. ‘రంపం’లో ఉన్నాను కానీ ‘కంపం’లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నేను మూడు అక్షరాల ఆంగ్ల పదాన్ని. ‘పప్పు’లో ఉన్నాను.. ‘ఉప్పు’లో లేను. ‘తాడు’లో ఉన్నాను.. ‘బీడు’లో లేను. ‘కంచె’లో ఉన్నాను.. ‘మంచె’లో లేను. నేనెవర్ని?


వాక్యాల్లో ప్రాణుల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని జీవుల పేర్లు దాగున్నాయి. అవేంటో వెతికి పట్టుకోండి చూద్దాం.

1. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా మొన్న చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్యే ఎక్కువ.
2. మొన్ననే కదా.. మీ మేనత్త వచ్చేటప్పుడు డబ్బా నిండా జీడిపప్పు తీసుకొచ్చింది!
3. కారును కాస్త వెనక్కి తీసుకో.. డిక్కీలో లగేజీని మేడపైకి తీసుకెళ్లు.
4. ఇదిగో పాపా.. ముళ్లు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ నడువు.
5. మరీ అంత బలవంతంగా చిన్నోడి నోట్లో కుక్కకు. ఆకలైతే వాడే ఏడుస్తాడు. అప్పుడు తినిపించు.  
6. లెక్కల మాస్టారు నరసింహం అంటే అందరికీ వణుకే. పరీక్షల్లో ఒక్క మార్కు తక్కువ వచ్చినా ఊరుకోరు తెలుసా!


పొడుపు కథలు

1. సముద్రంలో పుట్టి.. సముద్రంలో పెరిగి.. ఊర్లోకొచ్చి అరిచేది?
2. కాళ్లు లేని కప్ప.. బెకబెకలాడని కప్ప.. ఏంటది చెప్మా?
3. నూతికి నూరు కన్నాలు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?


తమాషా ప్రశ్నలు

1. మూడు చెవులున్న కుక్కను ఏమని పిలుస్తారు?
2. తినే కర్ర ఏంటి?
3. ఇంటిపై కప్పలేని రేకులు?


క్విజ్‌.. క్విజ్‌...!

1. మనిషి ముఖంలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
2. మనదేశంలో ఎత్తైన జలపాతం పేరేంటి?
3. మన జాతీయ పక్షి ఏంటి?
4. అత్యధిక వైశాల్యం కలిగి ఉన్న దేశం ఏది?
5. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయుడు ఎవరు?


తప్పులే తప్పులు!

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటిలో అక్షర దోషాలున్నాయి. మీరు వాటిని సరిచేసి రాయగలరా?
1. ఆనంతపురం
2. పంఛామృతం
3. పాదరక్చలు
4. తీర్తజలం
5. జనజీవణం
6. లంభకోణం
7. గర్షణ
8. ఘర్జన


సమాధానాలు :

తమాషా ప్రశ్నలు?: 1.కుక్క అనే పిలుస్తారు 2.జీలకర్ర 3.పూతరేకులు

క్విజ్‌.. క్విజ్‌..!: 1.14 ఎముకలు 2.జోగ్‌ జలపాతం 3.నెమలి 4.రష్యా 5.రాకేశ్‌ శర్మ

పొడుపు కథలు: 1.శంఖం 2.తాళం కప్ప 3.జల్లెడ

నేనెవర్ని? : 1.వందేమాతరం 2.పతాకం

వాక్యాల్లో జీవుల పేర్లు : 1.చేప 2.నత్త 3.కోడి 4.పాము 5.కుక్క 6.సింహం

అక్షరాల చెట్టు: AUTOBIOGRAPHY

తేడాలు కనుక్కోండి!: 1.కుక్క కాలు 2.కిటికీ 3.పొద 4.మేఘం 5.అమ్మాయి జుట్టు 6.నీరు

తప్పులే తప్పులు: 1.అనంతపురం 2.పంచామృతం 3.పాదరక్షలు 4.తీర్థజలం 5.జనజీవనం 6.లంబకోణం 7.ఘర్షణ 8.గర్జన



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని