అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 14 Aug 2022 00:42 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


తమాషా ప్రశ్నలు

1. క్యాలెండర్‌లో కనిపించని వారం
2. గుమ్మాలకు తోరణాలు ఎందుకు కడతారు?


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘వంక’లో ఉన్నాను కానీ ‘డొంక’లో లేను. ‘గద’లో ఉన్నాను కానీ ‘గది’లో లేను. ‘మీనం’లో ఉన్నాను కానీ ‘మీసం’లో లేను. ఇంతకీ నేను ఎవరిని?
2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘స్వేదం’లో ఉన్నాను.. ‘మోదం’లో లేను. ‘స్వచ్ఛత’లో ఉన్నాను.. ‘స్వతహా’లో లేను. నేనెవర్నో చెప్పగలరా?


పొడుపు కథలు

1. పొడవేమో జానెడు.. పొట్టనిండా ముత్యాలే. ఏంటది?  
2. మూడు కాళ్లతో నడుస్తుంది కానీ ముందుకు తప్ప వెనక్కి మాత్రం వెళ్లలేదు. అదేంటో?
3. అందరికీ కొడుకూ, కూతురూ అవుతారు. ఎవరు వారు?
4. ఎండలో బయటకు వస్తుంది. గాలొస్తే మాయమైపోతుంది. ఏంటబ్బా?


వాక్యాల్లో సంగీత వాయిద్యాల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని సంగీత వాయిద్యాల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి, అవేంటో కనిపెట్టండి చూద్దాం.
1. తను నా స్నేహితురాలు ప్రవీణ.. కలిసి చదువుకుందామని నేనే రమ్మని చెప్పా.
2. మా చెల్లి నవీన, మీ అక్క సమత.. బలాబలాలేంటో రేపు పోటీలో తెలుస్తాయిలే!

3. గత నెలలో భీమడోలు నుంచి తీసుకొచ్చిన స్నాక్స్‌ భలే రుచిగా ఉన్నాయి.
4. ఇక్కడున్నంత వరకు కాస్త తగ్గించుకో నీ ఆవేశం.. ఖండాంతరాల ఖ్యాతిని చెడగొట్టుకోకు.






జవాబులు:

పట్టికల్లో పదం: జాతీయ పతాకం

ఒకే అక్షరం: 1.పడవ, వడ 2.గొడవ, వల 3.తెగువ, వరద 4.మగువ, వలయం 5.కడవ, వరం 6.చొరవ, వజ్రం

అక్షరాల పట్టిక: house cleaning

అది ఏది? : 2

వాక్యాల్లో సంగీత వాయిద్యాల పేర్లు : 1.వీణ 2.తబలా 3.డోలు 4.శంఖం  నేనెవర్ని? : 1.వందనం 2.స్వేచ్ఛ

పొడుపు కథలు : 1.బెండకాయ 2.గడియారం 3.పెళ్లికొడుకు, పెళ్లికూతురు 4.చెమట

తమాషా ప్రశ్నలు: 1.పరివారం 2.కట్టకుంటే పడిపోతాయి కాబట్టి..



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని