అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 20 Aug 2022 00:44 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పొడుపు  కథలు

1. చెట్టుకు కాయని కాయ.. కొరికితే కరకర.. ఏంటది?
2. ప్రతి ఇంట్లో ఉంటుంది.. ముఖం లేదు కానీ బొట్టు మాత్రం పెట్టించుకుంటుంది. అదేంటో?
3. తిరుగుతూ ఆడుతుంది.. ఆగితే పడుతుంది. ఏంటబ్బా?


వాక్యాల్లోదేశాల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని దేశాల పేర్లు దాగున్నాయి. అవేంటో వెతికి పట్టుకోండి చూద్దాం.
1. మా అమ్మమ్మ నీరజ, పాన్‌ కోసం వెళ్లివచ్చేసరికి రైలు ప్లాట్‌ఫామ్‌ మీద నుంచి బయలుదేరింది.  
2.  చంటీ.. ఇకనుంచైనా పాఠశాలకు ప్రతి రోజూ రావడం అలవాటు చేసుకో..
3. మా అన్నయ్య చదివింది బీకాం. గోవాలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్నాడు.
4. చిప్స్‌ అన్నీ తనే కింద పారబోసి, రియా నా పేరు చెబుతోంది అంకుల్‌!


నేనెవర్ని?

నేను నాలుగక్షరాల పదాన్ని. ‘గోవు’లో ఉంటాను కానీ ‘రేవు’లో లేను. ‘పానకం’లో ఉన్నాను కానీ ‘పూనకం’లో లేను. ‘కీలు’లో ఉన్నాను కానీ ‘కీడు’లో లేను. ‘అడుగు’లో ఉన్నాను కానీ ‘అరుగు’లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?


చెప్పగలరా?

ఈ బొమ్మలో కొన్ని పండ్ల ముక్కలు ఉన్నాయి. అది ఏ పండో చెప్పగలరా?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.



అంత్యాక్షరి!

నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతోనే, తరవాతి పదం ప్రారంభం అవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


జవాబులు

అంత్యాక్షరి : 1.చిరుత 2.తమలపాకు 3.కుడితి 4.తిమింగలం 5.లంచం

పొడుపు కథలు : 1.కజ్జికాయ 2.గడప 3.బొంగరం

కవలలేవి? : 2, 4

అక్షరాల చెట్టు : DRAMATIZATION

వాక్యాల్లో దేశాల పేర్లు : 1.జపాన్‌ 2.చైనా 3.కాంగో 4.సిరియా

నేనెవర్ని? : గోపాలుడు

చెప్పగలరా? : డ్రాగన్‌ ఫ్రూట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని