అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 21 Aug 2022 01:04 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


తమాషా ప్రశ్నలు

1. నీటిలో ప్రయాణించలేని బోట్‌?
2. ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను ఎందుకు కడతారు?
3. గాలిపటంతో దారం ఏం అంటుంది?


నేనెవర్ని?

1. నేనో మూడక్షరాల పదాన్ని. ‘పదం’లో ఉంటాను. ‘కదం’లో ఉండను. ‘వడ’లో ఉంటాను. ‘వల’లో ఉండను. ‘వరద’లో ఉంటాను. ‘బురద’లో ఉండను. నేనెవరో తెలుసా?
2. నేను నాలుగక్షరాల పదాన్ని ‘గాడిద’లో ఉంటాను. ‘బూడిద’లో ఉండను. ‘గాలి’లో ఉంటాను. ‘గాజు’లో ఉండను. ‘పలుకు’లో ఉంటాను. ‘ములుకు’లో ఉండను. ‘కెరటం’లో ఉంటాను. ‘కిరీటం’లోనూ ఉంటాను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


వాక్యాల్లో రంగులు!

ఈ వాక్యాల్లో కొన్ని రంగుల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివి అవి ఏంటో కనుక్కోండి చూద్దాం.
1. సోనీ.. లంగావోణీలో నువ్వు ఎంత బాగుంటావో తెలుసా!

2. భూ ప్రకంపనలు పులిని భయపెడతాయా?
3. మా అన్నయ్య హరి తంజావూరు వెళ్లి ఇంకా రాలేదు అంకుల్‌!

4. సంగీతా..! ఈ బెలూన్ల నిండా గాలి ఊదాలి... సరేనా!
5. గోపికా... ‘షాయం’ కాదు.. ‘సాయం’ అని రాయాలి.





సమాధానాలు :

బొమ్మల్లో ఏముందో: 1.వరాహం 2.రాతిబొమ్మ 3.చెట్టుకొమ్మ 4.చెదపురుగులు 5.గుడిసె 6.సెలయేరు

నేనెవర్ని?: 1.పడవ 2.గాలిపటం

అక్షరాల చెట్టు: ADMINISTRATOR

పొడుపు కథలు: 1.ఆకలి 2.సూది, దారం 3.పాపిట

తమాషా ప్రశ్నలు: 1.రోబోట్‌ 2.కట్టకుంటే పడిపోతుంది కాబట్టి 3.ఏమీ అనదు

వాక్యాల్లో రంగులు: 1.నీలం 2.నలుపు 3.హరితం 4.ఊదా 5.కాషాయం

అది ఏది?: 1



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని