ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 24 Aug 2022 00:19 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పగలరా?

1. అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. మొదటి మూడు అక్షరాలు కలిస్తే ‘గాలిపంకా’ అనీ.. 4, 2, 3 అక్షరాలు కలిస్తే ‘డబ్బా’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేను ఎవరినో తెలిసిందా?

2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. మొదటి మూడు అక్షరాలు కలిస్తే ‘గెలుపు’ అనీ.. 1, 2, 3, 4 అక్షరాలు కలిస్తే ‘పవనం’ అనే అర్థాన్నిస్తా. నేనెవరినో చెప్పగలరా?

3. నాలుగక్షరాల పదాన్ని నేను. 2, 3, 1 అక్షరాలు కలిస్తే ‘లక్ష్యం’ అనీ.. 3, 4 అక్షరాలు కలిస్తే ‘లోపల’ అనే అర్థాన్నిస్తా. నేనెవర్ని?


అవునా.. కాదా?

1. ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే వంతెనను జమ్మూ కశ్మీర్‌లో నిర్మిస్తున్నారు.
2. పెట్రోల్‌, డీజిల్‌తో పోలిస్తే విద్యుత్తు వాహనాల్లో ప్రయాణ ఖర్చు చాలా ఎక్కువ.

3. అక్టోపస్‌కు ఒకటే గుండె ఉంటుంది.
4. పోలవరం ప్రాజెక్టును గంగా నదిపై నిర్మిస్తున్నారు.

5. ప్రపంచంలో ఎక్కువమంది సందర్శించే దేశం ఫ్రాన్స్‌.
6. ఇండోనేషియా దేశంలో అత్యధిక భూకంపాలు వస్తుంటాయి.

7. ఊసరవెల్లి ఒకేసారి రెండువైపులా చూడగలదు.
8. బొద్దింక పావుగంట పాటు నీటిలో మునిగిపోయి ఉన్నా చనిపోదు.


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
1. ధారాశున్యలు
2. రంముమంద్దదా
3. సయనపామల
4. టిఅకారలుయ
5. టితావలునా
6. పిగోట్టడ
7. బానిమాజాద్‌
8. హదేలురశస్యా


తమాషా ప్రశ్నలు

1. గ్రీన్‌ టీ తాగితే ఏమవుతుంది?
2. చాలా మందికి నచ్చే నస?
3. ఏడాదికోసారి మాత్రమే వచ్చే వరి?




జవాబులు:

బొమ్మల్లో ఏముందో? : 1.గొంగళి పురుగు 2.గులాబీ పూలు 3.బీరకాయలు 4.ఆటబొమ్మలు 5.ఆవు 6.షికారు

ఏది భిన్నం : 3

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.కాదు (మూడు) 4.కాదు (గోదావరి) 5.అవును 6.కాదు(జపాన్‌) 7.అవును 8.అవును

పదమేది? : EXTRAORDINARY

గజిబిజి బిజిగజి! : 1.ధాన్యరాశులు 2.ముద్దమందారం 3.సమయపాలన 4.అరటికాయలు 5.తాటివనాలు 6.పిట్టగోడ 7.నిజామాబాద్‌ 8.దేశరహస్యాలు

తమాషా ప్రశ్నలు : 1.కప్పు ఖాళీ అవుతుంది 2.పనస 3.జనవరి

చెప్పగలరా? : 1. FANCY 2. WINDOW 3. MAIN



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని