ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 02 Sep 2022 00:46 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


చెప్పగలరా?

1. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 1, 2, 3, 5 అక్షరాలను కలిపితే మూడు చక్రాల వాహనం అవుతాను. 6, 1, 3 అక్షరాలను కలిపితే ఎలుకనవుతా. ఇంతకీ నేనెవర్ని?

2. ఏడక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 3, 2, 4, 7 అక్షరాలను కలిపితే ‘ముక్కు’ అనీ.. 2, 3, 7 అక్షరాలను కలిపితే ‘ఒకటి’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?

3. నేను నాలుగు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 4 అక్షరాలను కలిపితే ‘పైన’ అనీ.. 3, 4 అక్షరాలను కలిపితే ‘లోపల’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో తెలిసిందా?


క్విజ్‌.. క్విజ్‌..!

1. హరివిల్లులో ఎన్ని రంగులుంటాయి?
2. ఎన్ని సెకన్లు కలిస్తే ఒక గంట?

3. మృగరాజు అని ఏ జంతువుకు పేరు?
4. మంచుతో నిర్మితమైన ఇంటిని ఏమని పిలుస్తారు?

5. ఏ రంగు శాంతికి చిహ్నం?


పొడుపు కథలు

1. నెత్తి మీద రాయి.. నోట్లో వేలు. ఏంటది?
2. ఒంటికాలు పొట్టోడు.. తెల్లని టోపీ పెడతాడు.. బోలెడు పోషకాలనిస్తాడు. ఎవరది?
3. పక్షి కాని పక్షి.. పిల్లలకు పాలిచ్చి పెంచే జీవి. అదేంటో?






జవాబులు:

తప్పులే తప్పులు: 1.అక్షరం 2.అమృతం 3.అభివృద్ధి 4.సమయోచితం 5.సంబంధం 6.పగడం 7.పుత్రుడు 8.ఎర్రచందనం

రాయగలరా?: 1.ఎదురుచూపులు 2.చిరుతపులి 3.చింతచిగురు 3.పెళ్లిపందిరి 4.ఎడారి ఓడ 5.కొండగట్టు 6.నత్తగుల్ల 7.వానపాము 8.పుట్టగొడుగు 8.కర్రపెత్తనం 9.పట్టుచీర 10.తోటకూర 11.కోటగోడ 12.గుండెచప్పుడు 13.బంతిపువ్వు

పదమాలిక!: 1.వడ 2.మేడ 3.మెడ 4.జడ 5.తొండ 6.దొండ 7.బెండ 8.కొండ 9.బండ 10.ఎండ

ఏది భిన్నం?: 3

క్విజ్‌.. క్విజ్‌..!: 1.ఏడు 2.3600 3.సింహానికి 4.ఇగ్లూ 5.తెలుపు

పట్టికల్లో పదం : నవరాత్రులు

చెప్పగలరా? : 1. AUTHOR 2. CONSUME 3. JOIN

పొడుపు కథలు : 1.ఉంగరం 2.పుట్టగొడుగు 3.గబ్బిలం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని