అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 11 Sep 2022 00:56 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పొడుపు కథలు

1. ఉండేది వేలెడంత.. తోక మాత్రం బోలెడంత. ఏంటది?
2. చేతులకు, కాళ్లకు ఎర్రటి మరకలు. మనం ఎంత కడిగినా పోవు. అదేంటో?  
3. మనిషేమో మాటకారి. కానీ, గడప దాటకుండా వాగుతుంటాడు. ఏంటబ్బా?


నేనెవర్ని?

నాలుగక్షరాల పదాన్ని నేను. ‘పంట’లో ఉన్నాను కానీ ‘మంట’లో లేను. ‘చలి’లో ఉన్నాను కానీ ‘పులి’లో లేను. ‘దారం’లో ఉన్నాను కానీ ‘ఘోరం’లో లేను. ‘ధార’లో ఉన్నాను కానీ ‘ధాన్యం’లో లేను. ఇంతకీ నేనెవర్ని?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. ఆక్టోపస్‌ కనుపాప దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.
2. ఏనుగు మెదడు బరువు దాదాపు అయిదు కిలోలు ఉంటుంది.
3. ఏదైనా డిగ్రీ చదువుతున్న వారిని గ్రాడ్యుయాండ్స్‌
(Graduands) అంటారు. చదువు పూర్తయ్యాకే వారు గ్రాడ్యుయేట్స్‌ అవుతారు.  
4. చూయింగ్‌గమ్‌ను కనిపెట్టింది ఓ ఇంజినీర్‌.
5. కిలో తేనెను సేకరించేందుకు పట్టులోని తేనెటీగలన్నీ కలిసి కనీసం 40 లక్షల పువ్వుల మీద వాలతాయి.  
6. పాములు అద్దాలపైన కూడా పాకగలవు.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. సరైన పదాలను కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


పదమేంటి?

ఇక్కడ కొన్ని బొమ్మలూ, ఆంగ్ల అక్షరాలూ ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న గణిత గుర్తుల ఆధారంగా వచ్చే పదమేంటో కనుక్కోండి చూద్దాం.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



జవాబులు 

అక్షరాల చెట్టు : BRAINSTORMING

అవునా.. కాదా? : 1.అవును 2.అవును 3.అవును 4.కాదు (దంత వైద్యుడు) 5.అవును 6.కాదు(అద్దాలపైన పాకలేవు)

పదమేంటి? : 1. MOUNTAIN 2. TECHNOLOGY

నేనెవర్ని? : పంచదార

రాయగలరా?: 1.గాలిపటం 2.చలిచీమ 3.పిండిమర 4.పావురాయి 5.కోడిపుంజు 6.తులసి కోట 7.మందారతైలం 8.జామపండు 9.చిరునవ్వు 10.చేపపిల్ల 11.పట్టుపురుగు 12.పెళ్లిసందడి 13.పంటపొలం 14.పట్టుకారు

పొడుపు కథలు : 1.సూది-దారం 2.గోరింటాకు 3.నాలుక

అది ఏది? : 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని