Updated : 18 Sep 2022 00:53 IST

పదమేంటి?

ఇక్కడ కొన్ని బొమ్మలూ, ఆంగ్ల అక్షరాలూ ఉన్నాయి. వాటి మధ్యలో ఉన్న గణిత గుర్తుల ఆధారంగా వచ్చే పదమేంటో కనుక్కోండి చూద్దాం.


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. మనిషి బరువులో దాదాపు ఏడు శాతం శరీరంలో ఉండే రక్తానిదే.

2. విటమిన్లలో మొదట కనిపెట్టింది.. విటమిన్‌ కె.

3. కనుగుడ్డు బరువు దాదాపు 28 గ్రాములు ఉంటుంది.

4. మెడను 360 డిగ్రీలు తిప్పగలిగిన ఏకైక జీవి.. గబ్బిలం. 

5. న్యాయమూర్తులు ‘ఆర్డర్‌.. ఆర్డర్‌’ అంటూ కొట్టే చెక్క సుత్తిని ఆంగ్లంలో ‘గవెల్‌’ అంటారు.

6. బొద్దింకలకు రేడియేషన్‌ను సైతం తట్టుకొనే శక్తి ఉంటుంది.  


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలపండి.


కనుక్కోండి చూద్దాం!

ఇక్కడ ఓ పట్టిక ఉంది. దానిలో కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే ఓ క్రీడ పేరు వస్తుంది. అదేంటో మీరు కనుక్కోండి!


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పొడుపు కథలు

1. నీరు తగిలినా.. తడి అంటదు. ఏంటది?

2. నీటిలో ఈదగలదు కానీ చేప కాదు. రెక్కలున్నాయి కానీ ఎగరలేదు. అదేంటబ్బా?

3. ఎర్రముక్కు దొర.. ఎంతసేపు నిల్చుంటే, అంత పొట్టివాడవుతాడు. ఏంటో?జవాబులు:

పొడుపు కథలు : 1.నీడ 2.పెంగ్విన్‌ 3.కొవ్వొత్తి

ఏది భిన్నం : 2

పదమేంటి? : 1. FARMER 2. FOUNDATION

పట్టికల్లో పదం : బాస్కెట్‌బాల్‌

కనుక్కోండి చూద్దాం: INTERNATIONAL

అవునా.. కాదా? : 1.అవును 2.కాదు (విటమిన్‌ బి1) 3.అవును 4.కాదు 5.అవును 6.అవును

తప్పులే తప్పులు: 1.సృజనాత్మకత 2.అలంకారం 3.మహనీయుడు 4.ఆదర్శప్రాయం 5.అభివృద్ధి 6.అహంకారం 7.అనుకరణ 8.సుస్వాగతం

రాయగలరా?: 1.పంచదార 2.నీలిమేఘం 3.కారుచీకట్లు 4.కటిక దారిద్య్రం 5.వానపాము 6.వాయువేగం 7.రథసారథి 8.కోడికూర 9.గోలిసోడా 10.అహంకారం 11.మల్లెతీగ 12.గాజుబొమ్మ 13.గాలిగోపురం 14.రావిచెట్టు 15.కనకవర్షం 16.పుట్టగొడుగు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts