ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Published : 21 Sep 2022 00:07 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓ చోట చేరిస్తే ఒక జీవి పేరు వస్తుంది. అదేంటో మీరు కనుక్కోండి.


చెప్పగలరా?

1. నేను అయిదక్షరాల పదాన్ని. ‘చిన్నారి’లో ఉంటాను. ‘పొన్నారి’లో ఉండను. ‘రుషి’లో ఉంటాను. ‘కృషి’లో ఉండను. ‘తడక’లో ఉంటాను. ‘పిడక’లో ఉండను. ‘పుట్ట’లో ఉంటాను. ‘తట్ట’లో ఉండను. ‘గాలి’లో ఉంటాను. ‘గాజు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘పలుగు’లో ఉంటాను. ‘కలుగు’లో ఉండను. ‘కల’లో ఉంటాను. ‘కళ’లో ఉండను. ‘కవి’లో ఉంటాను. ‘చెవి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


అవునా.. కాదా..?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1. ఇటీవల మన దేశానికి నమీబియా నుంచి చీతాలను తీసుకొచ్చారు.
2. హమ్మింగ్‌ బర్డ్స్‌ వెనక్కు ఎగరలేవు.
3. శ్రీలంక రాజధాని కొలంబో.
4. చంద్రుడికి అయిదు ఉపగ్రహాలున్నాయి.
5. కునో నేషనల్‌ పార్క్‌ ఉత్తరప్రదేశ్‌లో ఉంది.
6. మన భారతదేశానికి 1947వ సంవత్సరంలో స్వాతంత్య్రం వచ్చింది.
7. పంచేంద్రియాలు ఆరు.
8. గజరాజు అని ఒంటెను పిలుస్తారు.
9. నాగుపాములో విషం ఉండదు.
10. విమానాన్ని రైట్‌ సోదరులు కనుగొన్నారు.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజి బిజిగజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.


తమాషా ప్రశ్నలు

1. గుబులు రేపే వరం ఏంటి?

2. నీళ్లలోనే ఉన్నా.. తడవని చాప ఏది?

3. సమాచారం అందించే వరాలు ఏవి?


జవాబులు

ఏది భిన్నం : 3

గజిబిజి బిజిగజి!: 1.తెలివితేటలు 2.మహారాజు 3.సీతాకోకచిలుక 4.గొంగళిపురుగు 5.గజరాజు 6.కూరగాయలు 7.సొరచేప 8.కాకరకాయ

తప్పులే తప్పులు: 1.హృదయాంజలి 2.ఆరోహణక్రమం 3.అవకాశం 4.అనుమానం 5.సాహసోపేతం 6.బలప్రదర్శన 7.కాలక్షేపం 8.కాంతిరేఖ

చెప్పగలరా?: 1.చిరుతపులి 2.పలక

పట్టికల్లో పదం: ఎలుగుబంటి

అవునా.. కాదా?: 1.అవును 2.కాదు 3.అవును 4.కాదు 5.కాదు 6.అవును 7.కాదు 8.కాదు 9.కాదు 10.అవును

తమాషా ప్రశ్నలు : 1.కలవరం 2.తెరచాప 3.వివరాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని