తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 10 Oct 2022 00:26 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తప్పులే తప్పులు!

కిందిపదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


పొడుపు కథలు!

1.  అందరికీ పైకి తీసుకెళ్తాను. కానీ నేను మాత్రం వెళ్లలేను. నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం?

2. నాకు చాలా కన్నులున్నాయి. కానీ నేను చూసేది మాత్రం రెండింటి తోనే. ఇంతకీ నేనెవరో తెలుసా?

3. రాజుగారి తోటలో రోజాపూలు చూసేవారే కానీ, కోసేవారు లేరు ఏమిటవి?

4. ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నమ్మ అణిగిమణిగి ఉంటుంది. ఏంటో తెలుసా?


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘కొండ’లో ఉంటాను. ‘బండ’లో ఉండను. ‘గోడ’లో ఉంటాను. ‘గోడు’లో ఉండను. ‘ముసురు’లో ఉంటాను. ‘ఉసురు’లో ఉండను. ‘పిచ్చుక’లో ఉంటాను. ‘పిలక’లో ఉండను. ఇంతకీ నేను ఎవర్ని?

2. నేను మూడక్షరాల పదాన్ని. ‘గజం’లో ఉంటాను. ‘భీజం’లో ఉండను. ‘మేడ’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘పలుగు’లో ఉంటాను. ‘కలుగు’లో ఉండను. నేను ఎవరో తెలుసా?


పదమాలిక

ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలను రాయండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


జవాబులు:

అక్షరాల చెట్టు: ANTICLOCKWISE

తప్పులే తప్పులు: 1.అవకాశం 2.ఆలోచన 3.సందర్భం 4.అనుకూలం 5.వాతావరణం 6.సమరం 7.రణరంగం 8.సద్వినియోగం

నేనెవర్ని?: 1.కొండముచ్చు 2.గడప

పదమాలిక: 1.పాము 2.పాక 3.పాలు 4.పావు 5.పార 6.పాప 7.పాపం 8.పాళీ

రాయగలరా?: 1.వానపాము 2.మేకపోతు 3.వడగండ్లు 4.కొబ్బరి నీరు 5.మందారమాల 6.ఉగాదిపచ్చడి 7.సాయంకాలం 8.కోడిగుడ్డు 9.వడదెబ్బ 10.కొండముచ్చు 11.విశాఖపట్నం 12.కారుమబ్బులు 13.మెల్లకన్ను 14.కలవరం 15.శ్రీకారం

పొడుపు కథలు: 1.నిచ్చెన 2.నెమలి 3.నక్షత్రాలు 4.విస్తరాకు

తేడాలు కనుక్కోండి!: 1.కుందేలు చెవి 2.బాతు తల 3.ముక్కు 4.చెట్ల స్థానం 5.ఆకులు 6.చెట్ల కింది పొద


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని