అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

Published : 16 Oct 2022 00:11 IST

ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పగలరా?

1. ప్రపంచంలోని దేశాల జెండాల్లో ఎక్కువగా ఉండే గుర్తు నక్షత్రం.
2. నేతి బీరకాయల్లో నెయ్యి ఉంటుంది.  
3. ఏనుగులు నడిచేటప్పుడు, ఒక కాలు గాలిలో ఉంటే.. మిగతా మూడు కాళ్లు నేలమీదే ఉంటాయి.  
4. మన రెండు చేతులు చాచి నిలబడితే.. ఆ వెడల్పు సరిగ్గా మన ఎత్తుకు సమానంగా ఉంటుంది.
5. కోకిల సొంతంగా గూడు కట్టుకోగలదు.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘డు’ అక్షరంతోనే ముగుస్తాయి.

1. ఆలోచనల పుట్ట 2. ధాన్యాన్ని మిల్లు పట్టిస్తే వచ్చేది 3. మానవుడే కానీ మరోలా.. 4. దున్నపోతు వాహనం కలిగి ఉండేది 5. దొంగ 6. వీరత్వం కలిగిన వ్యక్తి 7. గోపాలుడు, వెన్నదొంగ 8. బెత్తెడు కంటే కాస్త ఎక్కువ


నేనెవర్ని?

1. మూడక్షరాల పదాన్ని నేను. ‘తిక్క’లో ఉంటాను కానీ ‘లెక్క’లో లేను. ‘కల’లో ఉంటాను కానీ ‘కళ’లో లేను. ‘కంచు’లో ఉంటాను కానీ ‘మంచు’లో లేను. ఇంతకీ నేను ఎవరినో చెప్పండి?

2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘వృత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘పక్షం’లో ఉంటాను కానీ ‘పక్షి’లో లేను. నేనెవరినో తెలిసిందా?


తప్పులే తప్పులు!

ఇక్కడున్న పదాల్లో ఒక్కో తప్పు ఉంది. అవేంటో గుర్తించండి చూద్దాం.



జవాబులు

పద వలయం : 1.మెదడు 2.తవుడు 3.నరుడు 4.యముడు 5.చోరుడు 6.వీరుడు 7.కృష్ణుడు 8.జానెడు

కవలలేవి? : 2, 3
అక్షరాల చెట్టు: ESTABLISHMENT
అవునా.. కాదా? : 1.అవును 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు

నేనెవర్ని? : 1.తిలకం 2.వృక్షం

తప్పులే తప్పులు! : 1.దక్షిణం 2.నజరానా 3.నిర్ణయం 4.మృగరాజు 5.సంభ్రమాశ్చర్యాలు 6.పరిశీలకులు 7.యుద్ధరంగం 8.నదీప్రవాహం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని