పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!

Published : 21 Oct 2022 00:08 IST

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి!


నేనెవర్ని?

1.  నాలుగక్షరాల పదాన్ని నేను. ‘గున్న’లో ఉంటాను కానీ ‘దున్న’లో లేను. ‘రుతువు’లో ఉంటాను కానీ ‘హేతువు’లో లేను. ‘వాసన’లో ఉంటాను కానీ ‘దుర్వాసన’లో లేను. ‘రంపం’లో ఉంటాను కానీ ‘భూకంపం’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘సంపు’లో ఉంటాను కానీ ‘పంపు’లో లేను. ‘తట్ట’లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను. ‘కంది’లో ఉన్నాను కానీ ‘పంది’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


తప్పులే తప్పులు!

కింది పదాల్లో ఒక్కో తప్పు ఉంది. వాటిని గుర్తించి, సరైన పదాలను రాయండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి ఖాళీల్లో సరిపోయే పదానికి, వ్యతిరేక పదమే తర్వాతి గడుల్లో సరిపోతుంది. అవేంటో కనిపెట్టండి.


జవాబులు

అక్షరాల చెట్టు : DEMONSTRATION

పట్టికల్లో పదం: కొబ్బరికాయ

తేడాలు కనుక్కోండి: 1.తేనెపట్టు 2.పువ్వు 3.మొగ్గ 4.ఎలుగుబంటి తోక 5.ఆకు 6.తేనెటీగ కాలు

నేనెవర్ని? : 1.గురువారం 2.సంతకం

రాయగలరా?: 1.కోపం- శాంతం 2.పేదలు- ధనికులు 3.నీరు- నిప్పు 4.పగలు- రాత్రి 5.చెడు- మంచి

తప్పులే తప్పులు!: 1.అక్షాంశం 2.విద్యాలయం 3.విమానాశ్రయం 4.ఓడరేవు 5.బహిష్కరణ 6.ఆశయం 7.హిమాలయాలు 8.సాగరం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని