దారి చూపండి

ఇక్కడి మూడు స్టార్ట్‌ పాయింట్లలో ఏదో ఒకదాన్నుంచి ప్రారంభించి.. గీతల మీదుగా ఏదైనా ఒక మార్గం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ మొత్తం మార్గంలో తి నుంచి నీ వరకూ అన్ని అక్షరాలు ఉండాలనేది నిబంధన. ఓసారి ప్రయత్నించండి.

Published : 01 Nov 2022 00:17 IST

ఇక్కడి మూడు స్టార్ట్‌ పాయింట్లలో ఏదో ఒకదాన్నుంచి ప్రారంభించి.. గీతల మీదుగా ఏదైనా ఒక మార్గం నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ మొత్తం మార్గంలో తి నుంచి నీ వరకూ అన్ని అక్షరాలు ఉండాలనేది నిబంధన. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. మూడు అక్షరాల పదాన్ని నేను. ‘నక్క’లో ఉన్నాను కానీ ‘తిక్క’లో లేను. ‘శిక్ష’లో ఉన్నాను కానీ ‘శిస్తు’లో లేను. ‘ఆత్రం’లో ఉన్నాను కానీ ‘ఆరాటం’లో లేను. ఇంతకీ నేనెవర్ని?

2. నేను రెండు అక్షరాల పదాన్ని. ‘వధ’లో ఉన్నాను కానీ ‘వల’లో లేను. ‘తెర’లో ఉన్నాను. ‘అర’లోనూ ఉన్నాను. నేను ఎవరినో తెలిసిందా?


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఒకసారి ప్రయత్నించండి.

1. తాలాగీనప
2. పానపరిసుల
3. నోలంమబ
4. గరసంమంసాగ
5. లుకపోళాకుష
6. కాగంఆశగ
7. శఅపానితం
8. జుకగావా


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘ప’ అక్షరంతోనే ప్రారంభం అవుతాయి.

1. కోడి కాని కోడి 2. మామిడి పండు రంగు 3. పొరలుగా ఉండే రొట్టె 4. ప్రయాణానికి మరోపేరు 5. ప్రతిష్టకు జంటపదం 6. అక్షరాలు దిద్దే వస్తువు 7. నిద్రించే సాధనం 8. నస పెట్టే పండు



జవాబులు:

అక్షరాల చెట్టు : CONTRADICTION

నేనెవర్ని? : 1.నక్షత్రం 2.ధర పద వలయం : 1.పకోడి 2.పసుపు 3.పరోటా 4.పయనం 5.పరువు 6.పలక 7.పరుపు 8.పనస 

దారి చూపండి : CADEBF లేదా CEBDAF

 కవలలేవి? : 2, 3

గజిబిజి బిజిగజి : 1.గీతాలాపన 2.సుపరిపాలన 3.మనోబలం 4.సాగరసంగమం 5.కళాపోషకులు 6.ఆకాశగంగ 7.అశనిపాతం 8.గాజువాక


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని