అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 02 Nov 2022 00:20 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


వాక్యాల్లో వ్యక్తుల పేర్లు

ఇక్కడి వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా గమనించి, అవేంటో కనిపెట్టగలరా?
1.  అసలే ఇది కార్తిక మాసం. శివాలయాల్లో చాలా రద్దీ ఉంటుంది.
2. విసిగించకుండా రారా.. జున్ను పాలు ఎంత బాగున్నాయో చూడు!
3. పాడైనవీ, నచ్చనివన్నీ ఒక సంచిలో వెయ్యి.. బయట పారేసివద్దాం.
4. అక్షరం విలువ తెలుసుకుంటే.. బడి ఎగ్గొట్టి సమయాన్ని వృథా చేసేవాడివీ కాదు.  
5. ఆహా.. ఎక్కడి నుంచో వినిపిస్తున్న ఆ వేణుగానం ఎంత బాగుందో కదా!
6. కిన్నెరసాని ప్రాజెక్టుకు చాలా ఏళ్ల చరిత్ర ఉంది.


చెప్పగలరా?

1.  ఏడు అక్షరాల ఆంగ్ల పదాన్ని నేను. 3, 2, 4 అక్షరాలు కలిస్తే ‘లక్ష్యం’ అనీ.. 1, 3, 7 అక్షరాలు కలిస్తే ‘నాన్న’ అనే అర్థాన్నిస్తా. నేను ఎవరినో చెప్పగలరా?

2. నేను ఆరు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 2, 3, 4 అక్షరాలు కలిస్తే ‘గాలి’ అనీ.. 1, 5, 6 అక్షరాలు కలిస్తే ‘ఎగరడం’ అనే అర్థాన్నిస్తా. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.

1.  హరివిల్లులో ఏడు రంగులుంటాయి.


2. ఆఫ్రికా అధ్యక్షుడి నిలయాన్ని వైట్‌హౌస్‌ అని పిలుస్తారు.


3.  పెనాల్టీ కార్నర్‌ చెస్‌కు సంబంధించిన పదం.
4. ఉక్రెయిన్‌ రాజధాని పేరు కీవ్‌.

5. చార్మినార్‌ అమరావతిలో ఉంది.
6. క్రికెట్‌లో 99 పరుగులు చేస్తే సెంచరీ అంటారు.


7. తాజ్‌మహల్‌ గంగానది ఒడ్డున ఉంది.

8. నల్లబంగారం అని బొగ్గును పిలుస్తారు.




జవాబులు:

అక్షరాల చెట్టు: INAPPROPRIATE

రాయగలరా?: 1.హోరుగాలి 2.పోరుబాట 3.శాంతిసందేశం 4.దేవదూత 5.దృష్టికోణం 6.విజయకేతనం 7.ఆదివారం 8.వేములవాడ 9.కాకినాడ 10.దండయాత్ర 11.ఆత్మకథ 12.గాలిమర 13.రుబ్బురోలు 14.కోడిగుడ్డు 15.కొబ్బరినీరు

అది ఏది?: 3

వాక్యాల్లో వ్యక్తుల పేర్లు : 1.కార్తిక 2.రాజు 3.నవీన 4.అక్షర 5.వేణు 6.కిన్నెర

చెప్పగలరా? : 1. DIAMOND 2. FAIRLY

అవునా... కాదా?: 1.అవును 2.కాదు 3.కాదు 4.అవును 5.కాదు 6.కాదు 7.కాదు 8.అవును



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు