పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘చి’ అక్షరంతోనే మొదలవుతాయి.

Published : 05 Nov 2022 00:19 IST

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘చి’ అక్షరంతోనే మొదలవుతాయి.

1. మాటలు నేర్చే పక్షి 2. బుజ్జి ఆకులు 3. వేగంగా పరుగెత్తే జీవి 4. విసుగులాంటిది 5. చినుకులకు ఏకవచనం 6. గుర్తులు 7. దుస్తులకు ఉండేది 8. కొసలు, కొనలు


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అక్కడా.. ఇక్కడా..

ఇక్కడ కొన్ని వాక్యాలూ, వాటి మధ్యలో ఖాళీలూ ఉన్నాయి. మొదటి ఖాళీల సమూహంలో నప్పే పదమే, తరవాతి గడుల్లోనూ సరిపోతుంది. ఓసారి ప్రయత్నించండి.


అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వాటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘తట్ట’లో ఉంటాను కానీ ‘బుట్ట’లో లేను. ‘రవి’లో ఉంటాను కానీ ‘కవి’లో లేను. ‘గని’లో ఉంటాను కానీ ‘పని’లో లేను. ‘తిక్క’లో ఉంటాను కానీ ‘వక్క’లో లేను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నేను నాలుగు అక్షరాల పదాన్ని. ‘గాటు’లో ఉంటాను కానీ ‘గీటు’లో లేను. ‘గాలి’లో ఉంటాను కానీ ‘గాజు’లో లేను. ‘పత్తి’లో ఉంటాను కానీ ‘సుత్తి’లో లేను. ‘వాటం’లో ఉంటాను కానీ ‘వాతం’లో లేను. నేనెవర్ని?



జవాబులు

అక్షరాల చెట్టు : ACCEPTABILITY

పద వలయం : 1.చిలుక 2.చిగురు 3.చిరుత 4.చిరాకు 5.చినుకు 6.చిహ్నాలు 7.చిరుగు 8.చివర్లు

కవలలేవి? : 1, 3

నేనెవర్ని? : 1.తరగతి 2.గాలిపటం

అక్కడా.. ఇక్కడా.. : 1.పార 2.చిత్ర 3.రంగం 4.పటం 5.గంట


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని